గడ్డం గీసుకునేందుకేనా గండికోట లిఫ్ట్

First Published May 26, 2017, 1:22 PM IST
Highlights

ఇపుడు పులివెందుల ప్రాంతానికి నీళ్లు అత్యవసరం.  అక్కడి పండ్ల తోటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. వానలు రావడం లేదు. ఇలాంటి సమయంలోనే  నీళ్లిచ్చి ఆదుకోవాలి.  కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన గండికోట లిఫ్ట్ కి రిజర్వాయర్ లో నీళ్లులేవు. కాలువ ఎండిపోయింది. దీనికి వెనక రాజకీయమేమిటి?

కడప జిల్లాలో ఒక జోక్  ప్రచారంలో ఉంది. గండికోట లిఫ్ట్ గడ్డంగీచుకునేందుకే..అనేది ఆ జోకు. గండికోట ప్రాజక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పూర్తయింది, నీళ్లిచ్చేందుకు కాదు,  కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకట సతీశ్ కుమార్ రెడ్డి పెరిగిన గడ్డం గీచుకునేందుకే అని  పులివెందుల ప్రాంతంలో  ఎవరిని కదిపినా చెబుతారు. ఇది జోక్ కాదు, కడుపు కాలిన బాధ.

 

ఎందుకంటే, జనవరి 17 తారీఖున కడపజిల్లా కొండాపురం మండలంపైడిపాలెంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండికోట లిఫ్ట్ ఇరిగేషన్  స్కీంను పండగలా ప్రారంభించారు (పై పోటో). పండగలా ఎందుకంటే, ఈ కెనాల్ తో పులివెందుల  ప్రాంతమంతా కృష్ణా నీళ్లు పారతాయని,రైతులంతా  వైఎస్ కుటుంబం పట్టునుంచి బయటపడి  టిడిపిలోకి వలస వస్తారని టిడిపి ప్రకటించారు. వైఎస్ చేయలేనిపని తాను చేశానని బాబు చెప్పుకున్నారు. ఆ తర్వాత అంతగా ఆనందించిన వ్యక్తి కౌన్సిల్ డిప్యూటి స్పీకర్ సతీశ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే, కృష్ణాజలాలు గండికోటప్రాజక్టు ద్వారా  కడప జిల్లాకు పారేదాకా గడ్డం తీయించుకోనని ఆయన జల దీక్ష పట్టారు.   ఏడాది పాటు గడ్డం పెంచారు. ప్రాజక్టు నీటిని ముఖ్యమంత్రి విడుదల చేశాక తన కోరిక నెరవేరిందని, ఇక గడ్డం తీయించుకుంటానని చెప్పారు.

 

ఇంతకుమంచి ఏం ప్రయోజనం జరిగిందని ప్రశ్నిస్తున్నారు, వేంపల్లి కి చెందిన వైసిపి నేత ఎ రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే, ఇపుడు పులి వెందుల ప్రాంతానికి నీళ్లు అత్యవసరం.  అక్కడి పండ్లతోటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. వానలు రావడం లేదు. ఇలాంటి సమయంలోనే  నీళ్లిచ్చి ఆదుకోవాలి. అదే ప్రాజక్టుల ప్రయోజనం. అయితే, గండికోటలో రిజర్వాయర్ లో నీళ్లు లేవు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన గండికోట లిఫ్ట్ పనిచేయడం లేదు.కాలువ ఎండిపోయింది.

జనవరి 17న ఈ ప్రాజక్టు ను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి చెప్పిందేమిటి? పులివెందుల ప్రాంతంలో 41 వేల ఎకరాలకు కృష్ణాజలాలను అవుకు రిజర్వాయర్ నుంచి మళ్లిస్తామన్నారు.  మరి మళ్లింపు ఏమయిందని అడుతుతున్నారు జిల్లా ప్రజలు.

 

రాయలసీమకు కృష్ణా జలాలను నికరంగా కేటాయించకపోవడం వల్లే గండికోట ప్రాజక్టు ఎండిపోయిందని భారత రైతు సంఘాల సమాఖ్య (సిఐఎఫ్ ఎ) బొజ్జ దశరథరామిరెడ్డి అన్నారు. గండికోట ప్రాజక్టు గాలేరు-నగరి కాలువ కొనసాగింపే. అయితే, కాలువకు కృష్ణాజలాలలో వాట లేదు. వాట ఇవ్వకుండా ఎపుడో అందుబాటులోకి వచ్చే అదనపు జలాల మీద నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు. అదనపు జలాలను ఆంధ్రప్రదేశ్ బ్రజేష్ కుమార్ నాయకత్వంలో రెండో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే దాకా ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంది.  ఇపుడు మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునేందుకు వీలులేదని ఈ ట్రిబ్యునల్ చెప్పింది. అలాంటపుడు ఆంధ్రప్రదేశ్ కు హక్కుఉన్న  జలాల వాట నుంచే రాయలసీమకు కేటాయింపుజరగాలి. మరొకవైపు పట్టి సీమకు నుంచి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలిస్తున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నందున,  అదే మోతాదులో కృష్ణజలాలను రాయలసీమకు కేటాయించాలి, ఇది ఎందుకు జరగడంలేదు. దీనివల్లే గండికోట లిప్ట్ పనికిరాకుండా పోయింది.

 

పులివెందుల కాలువ ఎండిపోయిన విషయం నిజమేనని సతీషకుమార్ రెడ్డి ఒప్పుకుంటున్నారు. దీనికి కారణం వర్షాలు లేకపోవడమేనని ఆయన ది హన్స్ ఇండియా పత్రిక ప్రతినిధికి చెప్పారు. ‘పంటలను కాపాడేందుకుప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నది. పళ్లతోటలను కాపాడుకునేందుకు అవసరమయిన నీటిని కొనేందుకు ఎకరానికి రు.2400 లను ప్రభుత్వం అందిస్తున్నది,’ ఆయన చెప్పారు.

 

 

 

 

click me!