అమిత్ షా లో అసహనమా?

First Published May 26, 2017, 9:01 AM IST
Highlights

హైదరాబాద్ లో సుజనా ఇంటికి భోజనానికి వెళ్ళటం, విజయవాడలో చంద్రబాబుతో విందు రాజకీయాలు అమిత్ షా  షెడ్డూల్లో లేవు. అయినా హాజరుకాక తప్పలేదు. ఇక్కడే అమిత్ షాలో తీవ్ర అసహనం చోటు చేసుకుందట.

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు పర్యటించిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉక్కిరిబిక్కిరి అయినట్లు సమాచారం. తన షెడ్యూల్లో లేని కార్యక్రమాలకు అటెండ్ అవ్వాల్సి రావటమే కాకుండా టిడిపిలోని కీలక నేతలు పర్యటన ఆద్యంతం తన వెంట ఉండటం కూడా అమిత్ అసహనానికి కారణంగా తెలుస్తోంది.

తెలంగాణాలో మూడురోజుల పర్యటనలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దాదాపు వెనకసీటుకే పరిమితయ్యారు. సరే, వెంకయ్య అంటే పార్టీ నేత. మరి, సుజనా చౌదరి మాటేమిటి? సుజనా టిడిపి రాజ్యసభ సభ్యుడే కాకుండా చంద్రబాబునాయుడుకు బాగా సన్నిహితుడు కూడా. కాకపోతే సుజనా తెలంగాణా పర్యటనలో యాక్టివ్ పార్ట్ తీసుకోలేదు.

మూడు రోజుల పర్యటన ముగించుకుని ఏపికి వెళ్ళే ముందురోజు అమిత్ షా సుజనా ఇంటికి విందుకు వెళ్ళారు. ఆ విందుకు వెళ్ళటం అమిత్ కు ఏమాత్రం ఇష్టం లేదట. విందు వెంకయ్య లేకుండా జరగదుకదా? అక్కడి నుండే టిడిపి నేతలు అమిత్ వెన్నంటే ఉన్నారు. మరుసటి రోజు విజయవాడకు వెళ్ళే విమానంలో చంద్రబాబు కూడా కలిసారు. దాంతో అమిత్ లో తీవ్ర అసహనం చోటు చేసుకున్నట్లు సమాచారం.

చంద్రబాబుకు సుజనా, వెంకయ్యలు అత్యంత సన్నిహితున్న సంగతి అందరికీ తెలిసిందే. అంటే, చంద్రబాబు కోసమే సుజనా, వెంకయ్యలు తనను కమ్ముకుంటున్నట్లుగా అమిత్ భావించారని పార్టీ వర్గాలు చెప్పాయి.

విజయవాడ చేరుకోగానే మళ్ళీ విమానాశ్రయంలోనే చంద్రబాబుతో కొద్దిసేపు గడిపారు. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినా మళ్ళీ విందు కోసం చంద్రబాబు నివాసానాకి అమిత్ చేరుకున్నారు. తర్వాత ఎవరిదారి వాళ్ళదే అనుకోండి. అయితే, హైదరాబాద్ లో సుజనా ఇంటికి భోజనానికి వెళ్ళటం, విజయవాడలో చంద్రబాబుతో విందు రాజకీయాలు అమిత్ షా  షెడ్డూల్లో లేవు. అయినా హాజరుకాక తప్పలేదు. ఇక్కడే అమిత్ షాలో తీవ్ర అసహనం చోటు చేసుకుందట.

click me!