
ముద్రగడ ప్రద్మనాభంకు కాపులపై ఉన్నది కేవలం కపట ప్రేమే అని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో కాపు నేత చేసిన వ్యతిరేక ప్రచార ప్రభావం ఏమీ పనిచెయ్యలేదని పేర్కొన్నారు. ముగిసిన రెండు ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అందరూ టీడీపీవైపే ఉన్నారన్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చెప్పినట్లు కాపుల పై కపట ప్రేమను వల్లిస్తున్నారని మీడియాతో ముద్రగడ పై ఆయన విరుచుకుపడ్డారు.
మూడున్నర సంవత్సరాల నుండి రాష్ట్రం అభివృద్ది కోసం టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకానికి కట్టుబడి తప్పకుండా హామీలన్ని నెరవేరుస్తామన్నారు. ఇన్నాళ్లు చేసిన అభివృద్దిని చూసి కాకినాడ ప్రజలు టీడీపీకి పట్టం కట్టారన్నారు. ముద్రగడను కాపులు ఎనాడు పట్టించుకోలేదన్నారు. అందుకు కాకినాడ కార్పొరేషన్ ఫలితాలే నిదర్శనమన్నారు చిన్నరాజప్ప.
వైసీపీ అధ్యక్షుడు జగన్ పై కూడా ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత మాటతీరే... ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణమన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
మరిన్ని తాజా విశేషాల కోసం కింద క్లిక్ చేయండి