వైఎస్‌ఆర్‌కు ఇడుపులపాయలో ఘన నివాళి

Published : Sep 02, 2017, 12:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
వైఎస్‌ఆర్‌కు ఇడుపులపాయలో  ఘన నివాళి

సారాంశం

♦ నేడు వైయస్ ఆర్  8వ వర్థంతి ♦ ఇడుపులపాయలోని వైయస్ ఆర్  ఘాట్ వద్ద నివాళులర్పించిన వైయస్ జగన్, కుటుంబ సభ్యులు ♦ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఏపీ ప్రతిపక్షనేత

దివంగత ముఖ్యమంత్రి వైయస్  రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతి కార్యక్రమం కడప జిల్లా ఇడుపుల పాయలోని వైెఎస్ ఆర్ ఘాట్ లో జరిగింది.  ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా వైఎస్ ఆర్ కు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్దకు శనివారం ఉదయాన్నే వైయస్ ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్  జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైయస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, బ్రదర్‌ అనీల్‌ కుమార్‌, వైయస్  వివేకానందరెడ్డి, వైయస్  ఆర్‌ సోదరుడు దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి,  మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
 వైయస్ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
 వైయస్ ఆర్‌ భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో మాత్రం ఆయన ఇంకా బతికే ఉన్నారని వైయస్ జగన్‌ ఈ సందర్భంగా ట్విట్‌ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu