విద్యార్థినులపై నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు.. విజయవాడలో ఆందోళన చేపట్టిన బాలికలు

By Asianet NewsFirst Published Jun 6, 2023, 7:11 AM IST
Highlights

తమపై కాలేజీ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ నర్సింగ్ విద్యార్థినులు విజయవాడలో ఆందోళనకు దిగారు. వీరికి విద్యార్థి సంఘ నాయకులు మద్దతు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

కాలేజీ ప్రిన్సిపాల్ తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ విజయవాడలో నర్సింగ్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీసి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

నీలిచిత్రాలకు బానిసై.. ఆరుగురు బాలికలపై ప్రిన్సిపాల్‌ ఆఘాయిత్యం..

పోలీసులు, విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారామెడికల్‌ అండ్‌ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఉంది. ఈ కాలేజీకి వైఎస్ఆర్ జిల్లా బద్వేలుకు చెందిన బసిరెడ్డి రవీంద్రరెడ్డి ప్రిన్సిపల్-చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భద్రాచలం, తిరువూరు, విస్సన్నపేట, నూజివీడు తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 80కి పైగా విద్యార్థినులు నర్సింగ్ కోర్సు చదువుకుంటున్నారు.

వీరంతా అక్కడే హాస్టల్ లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. అయితే వీరిలో ఫస్ట్ ఇయర్ చదివే పలువురు విద్యార్థినులు ప్రిన్సిపాల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ సోమవారం నిరసన తెలియజేశారు. రవీంద్రరెడ్డి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తమ టీసీలు తమకు ఇచ్చాలని ఆందోళన చేపట్టారు. దీంతో ఈ వేధింపుల ఘటన బయటకు వచ్చింది. బాధితుల చేస్తున్న ఆందోళనకు పీఓడబ్ల్యూ, పీడీఎస్ యూ నాయకులు మద్దుతగా నిలిచారు. విద్యార్థినులు చేస్తున్న నిరసనలో పాల్గొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేయాలని వారంతా డిమాండ్ చేశారు.

'నేను ఎవరికీ తలవంచను' : కేంద్రానికి అభిషేక్ బెనర్జీ సవాల్

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. రాత్రి 11 గంటల సమయంలో క్లాసులు ఉన్నాయని ప్రిన్సిపల్ పిలుస్తున్నాడని వారు ఆరోపించారు.  ఈ టైమ్ లో క్లాసులేంటని అడిగితే.. తనకు మూడ్ వచ్చినప్పుడు క్లాసులు చెబుతానని ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. తమ బాడీ పార్ట్స్ ను తాకుతూ, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని వారు ఆరోపించారు. తాము అనారోగ్యానికి గురైనా, తమ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనా కూడా వారితో సెల్ ఫోన్ లో మాట్లాడే అవకాశం ఇచ్చేవాడు కాదని వాపోయారు.

స్వదేశంలో యుద్ద విమాన ఇంజిన్ తయారీ..! అమెరికా- భారత్ ల మధ్య కీలక ఒప్పందం

తమ కోర్సులో ఇంటర్నల్‌ మార్కులు ఉండటం, ప్రిన్సిపల్‌, చైర్మన్ గా ఆయనే వ్యవహిస్తుండటంతో తమ బాధ ఎవరికి తెలియజేయాలో అర్థమయ్యేకాదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల కిందట తమ సీనియర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయం తమకు తెలియడంతో, తమకు అలాంటి పరిస్థితి రాకూడదనే భయంతో కాలేజీని విడాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇటీవలే ఓ విద్యార్థినిపై ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ సమయంలో తాము ఆందోళన నిర్వహించినట్టు పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై ఓ విద్యార్థిని ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసినట్టు‘ఈనాడు’ కథనం పేర్కొంది. 

click me!