అమరావతే ఎన్నికల ప్రధాన నినాదం.. 2024 ఎన్నికల్లో టీడీపీ ఫోకస్ మొత్తం రాజధాని అంశంపైనే..

By Asianet NewsFirst Published Jun 12, 2023, 1:06 PM IST
Highlights

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారం చేపట్టాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. దీని కోసం అధికార వైసీపీని ‘అమరావతి’ నినాదంతో ఇరకాటంలో పెట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ విషయంలో ప్రచారం మొదలుపెట్టాలని ఇప్పటికే ఆ పార్టీ ఐటీ విభాగానికి చంద్రబాబు నాయుడి నుంచి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. 

ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం అమరావతి అంశాన్ని ప్రధాన నినాదంగా చేసుకోవాలని ప్రతిపక్ష టీడీపీ యోచిస్తోంది. అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, తాము ప్రారంభించిన, వైసీపీ ప్రభుత్వం ఆపివేసిన ప్రతీ పనిని పునరుద్ధరిస్తామని ఆ పార్టీ ప్రజలకు హామీ ఇస్తోంది. అమరావతి నినాదమే తమను వచ్చే ఎన్నికల్లో గెలుపును తెచ్చి పెడుతోందని టీడీపీ భావిస్తోంది.

శరీరాన్ని అసభ్యంగా తాకుతూ, 40 మంది దాడి చేశారని ఆర్మీ జవాను భార్య

Latest Videos

దీని కోసం 2024 ఎన్నికలకు అమరావతిని ప్రధాన ఇతివృత్తంగా మార్చేందుకు నినాదాలు, ప్రచార డిజైన్లతో ముందుకు రావాలని పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ఐటీ విభాగాన్ని (ఐ-టీడీపీ) ఆదేశించినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. అమరావతిని పునరుద్ధరించడం వల్ల ప్రజల మనోభావాలు తమకు అనుకూలంగా మారి ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు.

బిపార్జోయ్ తుఫాను బీభత్సం.. ముంబై విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితులు

2015 నుంచి 2019 వరకు అమరావతిలో జరిగిన అన్ని కార్యకలాపాలు, ప్లాన్ చేసిన డిజైన్లు, అభివృద్ధి చేసిన రోడ్లు, నిర్మించిన భవనాలను హైలైట్ చేయాలని ఐ-టీడీపీని చంద్రబాబు నాయుడు కోరారు. ఇవన్నీ వీలైనంత వరకు డిజిటల్ రూపంలో ప్రజలకు చేరాలని చంద్రబాబు ఐటీ విభాగానికి సూచించారు. ప్రపంచ స్థాయి రాజధాని కోసం భూములివ్వడంలో రైతుల త్యాగాలు, అంతర్జాతీయంగా పేరొందిన ఆర్కిటెక్ట్ లు ఇచ్చిన డిజైన్లు, నగర మాస్టర్ ప్లాన్ వంటివన్నీ ఎన్నికలకు ముందు టీడీపీ ప్రచారానికి కేంద్ర బిందువుగా మారాలని ఆయన పేర్కొన్నారు.

విషాదం.. 11 ఏళ్ల మూగ బాలుడిని కరిచి చంపిన వీధి కుక్కలు.. ఎక్కడంటే ?

కాగా.. అమరావతి ఎక్కడికీ పోదని, 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం అనుకున్నట్లుగానే రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగుతుందని రైతులకు, రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే వ్యూహంలో ఆ పార్టీ నిమగ్నమైంది. అమరావతిలో వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చూపించాలని ఐటీడీపీ బృందాన్ని చంద్రబాబు ఆదేశించారు. ఇందులో ప్రారంభమై సగం పూర్తయిన భవనాలు, అసంపూర్తిగా ఉన్న రోడ్ల వంటివి చూపించాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిని నిర్మిస్తుందనే సందేశాన్ని ప్రజలకు గట్టిగా, స్పష్టంగా ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.
 

click me!