'ఇదంతా రాజకీయ కక్ష సాధింపుతో'.. టీడీపీ రాష్ట్ర బంద్ కు జనసేన మద్దతు

Published : Sep 10, 2023, 11:46 PM IST
'ఇదంతా రాజకీయ కక్ష సాధింపుతో'..  టీడీపీ రాష్ట్ర బంద్ కు జనసేన మద్దతు

సారాంశం

టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు జనసేన మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ సోమవారం చేయనున్న రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటించింది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్టు అయినా టీడీపీ అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు 14 రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సోమవారం బంద్ కు పిలుపునిచ్చింది. ఈ రాష్ట్ర  బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటించింది. టీడీపీ రాష్ట్ర బంద్ పిలుపునకు జనసేన(Janasena) మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. 

ఈ మేరకు జనసేన తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్విట్ చేస్తూ.. ‘‘ పత్రిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును జనసేన పార్టీ ఇప్పటికే ఖండించింది. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోంది. ప్రజాపక్షం వహిస్తూ.. మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో వైసీపీ ప్రభుత్వం కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోంది. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ నిరసిస్తుంది. రేపు జరగబోయే బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనవల్సిందిగా కోరుతున్నాను.’’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!