చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు.. ప్రత్యేక రూం కేటాయింపు.. !

Published : Sep 10, 2023, 10:28 PM IST
చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు.. ప్రత్యేక రూం కేటాయింపు.. !

సారాంశం

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకి రిమాండ్ విధించి.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ క్రమంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగిలింది. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకి రిమాండ్ విధించింది. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ ఉద్రిక్తత పరిస్ధితుల నేపథ్యంలో విజయవాడ నుంచి రాజమండ్రి రోడ్డు మార్గంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించేందుకు కోర్టు అంగీకరించింది. భద్రతా కారణాల రీత్యా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక రూం ఇవ్వాలని, చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని జైలు అధికారులకు కోర్టు ఆదేశించింది.   
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Independence Day Celebrations | Nara Bhuvaneswari | Asianet Telugu
CM Chandrababu Highlights @Independenceday 2026 | Asianet Telugu