'ఇక జీవితాంతం జైల్లోనే ' : చంద్రబాబు అరెస్టుపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Vijayasai Reddy: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ అయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Vijayasai Reddy Sensational Comments on nara Chandrababu Naidu Has To Stay In Jail For Life Long KRJ

Vijayasai Reddy: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ అయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ తరుణంలో చంద్రబాబు అరెస్టుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

చంద్రబాబు చాలా నేరాలు చేశారని, కానీ ఇన్నాళ్లు చట్టం కళ్ళుగప్పి తిరిగారని విమర్శించారు. కానీ ఈసారి మాత్రం దొరికిపోయారని అన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు పదేళ్ల జైలు శిక్ష పడుతుందని అన్నారు. చట్టం ముందు అందరు సమానులే అని.. తప్పు చేస్తే శిక్ష నుండి తప్పించుకోలేరని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు గారని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడే పని చేయాలని అన్నారు. ఈ పాలకులైన రాజ్యాంగాన్ని అనుసరించి పాలించాలని కోర్టు మరోసారి ఈ తీర్పుతో స్పష్టం చేసిందని అన్నారు.

Latest Videos

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలతో  సీఐడీ కేసు పెట్టింది. ఇదే కాదు చంద్రబాబుపై మరో 6, 7 ప్రాసిక్యూషనల్ కేసులు ఉన్నాయని హెచ్చరించారు. చట్టాన్ని తృణప్రాయంగా మార్చుకొని. తన ఇష్టం వచ్చినట్టు వివరించారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర సంపదలను చంద్రబాబు దోచుకున్నాడని, విదేశాలలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారని, వాటన్నిటిని కచ్చితంగా వెనక్కి రప్పిస్తామని విజయ సాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు.  

ఈ కేసులో చంద్రబాబుకు పదేళ్ల జైలు శిక్ష పడుతుందనీ, మరిన్ని కేసులు రుజువైతే.. పూర్తిగా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రిమాండ్ లో ఇంకా అనేక నిజాలు బయటపడతాయనీ,  చంద్రబాబే కాదు.. రామోజీరావు కూడా దారుణ నేరాలకు పాల్పడ్డారని కీలక వ్యాఖ్యలు చేశారు.  

కోర్టు రిమాండ్ తో పాటు పోలీసుల రిమాండ్ కూడా ఉంటుందనీ,  ఒక్కసారి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అది కోర్టు పరిధిలోకి వెళ్తుందని అన్నారు. కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నారు.  

vuukle one pixel image
click me!