అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు: ఒంగోలులో ఇద్దరమ్మాయిల వివాహం

Published : Feb 24, 2022, 10:42 AM IST
అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు: ఒంగోలులో ఇద్దరమ్మాయిల వివాహం

సారాంశం

ఒంగోలులో ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకొన్నారు. ఈ విషయం పోలీస్ స్టేషన్ కు చేరింది. రెండు కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని వ్యతిరేకిస్తున్నారు. అయితే  ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒంగోలు: ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఇద్దరు అమ్మాయిలు గొడవ పడి Police station మెట్లెక్కారు. ఈ ఘటన Prakasam జిల్లాలో చోటు చేసుకొంది. అయితే ఈ ఇద్దరు Girls వివాహం చేసుకొన్న విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో రెండు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

ongole పట్టణానికి చెందిన ఇద్దరు యువతులు love పెళ్ళి చేసుకున్నారు.  ఈ విషయమై  ఇంట్లో చెప్పారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యాయరు. అంతేకాదు వీరి ప్రేమ Marriage కి అభ్యంతరం తెలిపారు. ఒకవైపు తల్లిదండ్రుల అభ్యంతరాలు కొనసాగుతుండగానే మరోవైపు ఈ యువతులు ఇద్దరూ ఒంగోలు collectorate  ఎదుట గొడవపడ్డారు. యువతులు ఇద్దరూ గొడవ పడటాన్ని గమనించిన ఓ Woman  Constable గమనించి  ఒంగోలు వన్ టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇద్దరు యువతులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  ఇద్దరు రెండు నెలలుగా కలిసి తిరుగుతున్నారని పోలీసులు చెప్పారు. అయితే ఇద్దరం కలిసి ఉంటామంటూ  ఇద్దరు యువతులు పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే ఈ విషయమై ఈ ఇద్దరు మరో రకమైన వాదనను కూడా పోలీసుల ముందుకు తీసుకొచ్చారని సమాచారం. ఈ ఇద్దరిలో ఓ అమ్మాయికి మేనమామతో వివాహం నిశ్చయం చేశారు. అయితే ఈ వివాహం ఇష్టం లేని యువతి  మరో యువతితో కలిసి ఉంటుంది. ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉంటూ చదువుకొంటున్నామని తెలిపింది. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారని ప్రచారం కూడా సాగుతుంది.

అక్కా చెల్లెళ్ల మాదిరిగా కలిసి జీవిస్తున్నామని తెలిపారు. యితే టిక్ టాక్ కోసమే తాము పెళ్లి చేసుకొన్నట్టుగా నటించామని ఓ యువతి తెలిపినట్టుగా ప్రచారం సాగుతుంది.  ఈ వీడియోలను చూసి తాము నిజంగానే పెళ్లి చేసుకొన్నట్టుగా భ్రమ పడుతున్నారని ఓ యువతి పోలీసులకు వివరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఇద్దరు యువతులు వివాహం చేసుకొన్నారా లేదా అనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?