పరువు హత్య: మృతదేహంతో ఆందోళన, నిందితుల కోసం నాలుగు టీమ్‌ల గాలింపు

Published : Jun 29, 2019, 03:49 PM IST
పరువు హత్య: మృతదేహంతో  ఆందోళన, నిందితుల కోసం నాలుగు టీమ్‌ల గాలింపు

సారాంశం

కులాంతర వివాహం చేసుకొన్న  కూతురిని అత్యంత దారుణంగా హత్య చేసిన భాస్కరనాయుడు కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహాంతో బాధిత కుటుంబసభ్యులు  ఆందోళన చేస్తున్నారు. అయితే భాస్కరనాయుడు కుటుంబసభ్యుల కోసం  నాలుగు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసులు తెలిపారు.


పలమనేరు: కులాంతర వివాహం చేసుకొన్న  కూతురిని అత్యంత దారుణంగా హత్య చేసిన భాస్కరనాయుడు కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహాంతో బాధిత కుటుంబసభ్యులు  ఆందోళన చేస్తున్నారు. అయితే భాస్కరనాయుడు కుటుంబసభ్యుల కోసం  నాలుగు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసులు తెలిపారు.

రెండేళ్ల క్రితం హేమావతి దళిత సామాజిక వర్గానికి చెందిన కేశవులును వివాహం చేసుకొంది. అగ్రవర్ణానికి చెందిన హేమావతి కుటుంబసభ్యులకు ఈ పెళ్లి నచ్చలేదు. దీంతో  హేమావతిని తీసుకొని ఆమె భర్త కేశవులు బెంగుళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాడు.

వారం రోజుల క్రితం హేమవతి మగబిడ్డకు జన్మనిచ్చింది.  హేమవతి తన బిడ్డకు ఆసుపత్రిలో చికిత్స చేయించి తిరిగి వస్తుండగా హేమావతి తండ్రి భాస్కరనాయుడు అతని కుటుంబసభ్యులు ఆమెను తీసుకెళ్లి హత్య చేశారు.

హేమావతి మృతదేహంతో  కేశవులు కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు  ఆందోళనకు దిగారు. భాస్కరనాయుడు కుటుంబసభ్యులను కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ తో ఆందోళన చేస్తున్న  బాధిత కుటుంబంతో పోలీసులు చర్చిస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని  పోలీసులకు ఫిర్యాదు చేస్తే  ముగ్గురు పోలీసులను ఇస్తాం.. ఖర్చు భరించాలని  పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని  కేశవులు ఆరోపిస్తున్నారు.

హేమవతిని హత్య చేసిన భాస్కరనాయుడు కుటుంబసభ్యుల కోసం నాలుగు పోలీసు బృందాలు  గాలింపు చర్యలు చేపడుతున్నాయని పలమనేరు డిఎష్పీ యుగంధర్ బాబు చెప్పారు.

సంబంధిత వార్తలు

పరువు హత్య: నిందితుడి ఇంటిని ధ్వంసం చేసిన గ్రామస్తులు

కులాంతర వివాహం: కూతుర్ని చంపిన తండ్రి

PREV
click me!

Recommended Stories

RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu