ఐదు రోజులు అక్కడే: 2004 నుండి 2014 వరకు బాబు ఇలానే...

By narsimha lodeFirst Published Jun 29, 2019, 3:06 PM IST
Highlights

అధికారానికి దూరమైన రోజుల్లో పార్టీ కార్యాలయంలో చంద్రబాబునాయుడు ఎక్కువ సమయాన్ని  కేటాయించేవాడు. ఇక రానున్న రోజుల్లో  కూడ ఎక్కువ సమయాన్ని  పార్టీ కార్యాలయంలో గడపనున్నారు. 2004లో కూడ అవలంభించిన విధానాన్ని  చంద్రబాబునాయుడు అవలంభించనున్నారు.

అమరావతి:  అధికారానికి దూరమైన రోజుల్లో పార్టీ కార్యాలయంలో చంద్రబాబునాయుడు ఎక్కువ సమయాన్ని  కేటాయించేవాడు. ఇక రానున్న రోజుల్లో  కూడ ఎక్కువ సమయాన్ని  పార్టీ కార్యాలయంలో గడపనున్నారు. 2004లో కూడ అవలంభించిన విధానాన్ని  చంద్రబాబునాయుడు అవలంభించనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2004 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ అధికారాన్ని కోల్పోయింది.ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి 1995 సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన పదవీ కాలానికి ఆరు మాసాలకు ముందే ఎన్నికలకు వెళ్లి అధికారానికి దూరమయ్యాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

ఆ ఎన్నికల్లో  అధికారానికి దూరమైన తర్వాత చంద్రబాబునాయుడు హైద్రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి  ప్రతి రోజూ వచ్చేవారు. ఉదయం పూట పార్టీ కార్యాలయానికి వచ్చేవారు. మధ్యాహ్నం పూట భోజనం కూడ పార్టీ కార్యాలయంలోనే చేసేవారు.  అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు పార్టీ కార్యాలయంలోనే నిద్రపోయేవారు. సాయంత్రం పూట మళ్లీ పార్టీ నేతలతో కలిసేవారు.

కొంత కాలం తర్వాత  ఉదయం పూట పార్టీ కార్యాలయానికి వచ్చి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లేవారు. అక్కడే సేద తీరి సాయంత్రానికి  పార్టీ కార్యాలయానికి వచ్చేవారు. కొన్ని సమయాల్లో తన ఇంట్లోనే పార్టీ నేతలతో సమావేశాన్ని నిర్వహించేవారు. పార్టీ కార్యక్రమాల్లో  తీరిక లేకుండా ఉంటే  మధ్యాహ్న భోజనాన్ని కూడ పార్టీ కార్యాలయానికి తెప్పించుకొనేవారు. 2004 నుండి 2014 వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలోనే ఎక్కువ సేపు గడిపేవాడు.

2014 ఎన్నికల్లో  అవశేష ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబునాయుడు అమరావతి నుండి పాలన సాగించాడు. హైద్రాబాద్‌ నుండి  అమరావతికి షిఫ్ట్ అయ్యాడు. 2019 ఎన్నికల్లో  చంద్రబాబునాయుడు నేతృత్వంలో  టీడీపీ ఓటమి పాలైంది. 

వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్‌పైనే ఎక్కువగా చంద్రబాబునాయుడు కేంద్రీకరించారు. పార్టీ కార్యక్రమాలకు తక్కువ సమయాన్ని కేటాయించారని బాబుపై పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.

అధికారానికి దూరమైన చంద్రబాబునాయుడు మరోసారి పార్టీ కార్యాలయంలో ఎక్కువ సమయాన్ని గడపనున్నారు.  జూలై 1వ తేదీ నుండి గుంటూరు పార్టీ కార్యాలయంలో చంద్రబాబునాయుడుతో పాటు పార్టీ సీనియర్లు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.

ఉదయం నుండి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలో  బాబు గడుపుతారు. ప్రతి రోజూ రాష్ట్రంలోని  రాజకీయస్థితిగతులపై సీనియర్లతో చర్చిస్తారు. సీనియర్లతో సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను కూడ చేశారు.  

అమరావతిలో పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆగష్టు లేదా సెప్టెంబర్ మాసంలో  కార్యాలయ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. నూతన కార్యాలయ నిర్మాణం పూర్తైతే శాశ్వత కార్యాలయంలో బాబు పార్టీ నేతలకు అందుబాటులో ఉంటారు. ప్రతి వారంలో కనీసం ఐదు రోజుల పాటు చంద్రబాబునాయుడు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.  

 

click me!