బాబుపై వైసీపీ నేత సెంథిల్‌కుమార్ వ్యాఖ్యలు: కుప్పంలో టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Oct 22, 2021, 5:07 PM IST
Highlights

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత సెంథిల్ కుమార్  అనుచిత వ్యాఖ్యలతో కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దీంతో రెండు పార్టీల శ్రేణులపై లాఠీచార్జీ చేశారు పోలీసులు.
 

చిత్తూరు: చిత్తూరు జిల్లా Kuppamలో టీడీపీ, ycpవర్గాల మధ్య శుక్రవారం నాడు ఘర్షణ చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. Tdp చీఫ్ Chandrababuపై వైసీపీ నేత సెంథిల్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఉద్రిక్తత చోటు చేసుకొంది.చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు చంద్రబాబు వస్తే  ఆయనపై Bomb వేస్తానని Senthil Kumar వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఇవాళ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.అదే సమయంలో వైసీపీ నేతలు  టీడీపీ ర్యాలీకి  ఎంఆర్ రెడ్డి సెంటర్ లో ఎదురుపడ్డారు.

also read:చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా.. కారణమదేనా...

 దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకొంది. వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకొని పోలీసులు భారీగా మోహరించారు. రెండు పార్టీల కార్యకర్తలపై లాఠీచార్జీ చేసి అక్కడి నుండి పంపారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి  పట్టాభి బూతు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ కార్యాలయాలపై, పట్టాభి ఇంటిపై అల్లరిమూకలు దాడికి దిగాయి. ఈ దాడులను నిరసిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ కార్యాలయంలోనే 36 గంటల దీక్షకు దిగాడు.

చంద్రబాబు దీక్షకు కౌంటర్ గా వైసీపీ నేతలు జనాగ్రహ దీక్షలపేరుతో రెండు రోజులుగా దీక్షలకు దిగారు. చంద్రబాబు, పట్టాభి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మలు దగ్దం చేస్తున్నారు.తనపై పట్టాభి చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. గిట్టనివాడు అధికారంలో ఉన్నందున తట్టుకోలేక రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

 


 

 


 

click me!