అధికారం కోసం సొంత తల్లి, చెల్లిని వీధుల్లోకి... ఇదీ జగన్ చరిత్ర: టిడిపి అనిత సంచలనం

By Arun Kumar PFirst Published Oct 22, 2021, 5:04 PM IST
Highlights

అధికారం కోసం చంద్రబాబు ఎంతకయినా తెగిస్తాడన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు టిడిపి మహిళా నాయకురాలు వంగలపూడి అనిత కాస్త ఘాటుగానే కౌంటరిచ్చారు. 

మంగళగిరి: రాజ్యాధికారం కోసం చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగిస్తాడన్న సీఎం జగన్ వ్యాఖ్యలు వింటే గురివిందగింజ కూడా సిగ్గుతో తలదించుకుంటుందని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేసారు. రాజ్యాధికారం కోసం ఎవరు తల్లిని వీధులపాలు చేశారో... ఎవరు చెల్లితో పాదయాత్ర చేయించారో... బాబాయి హత్యని ఎవరు రాజకీయంగా వాడుకున్నారో అందరికీ తెలుసని అనిత అన్నారు.  

''CM Jagan ఏ రాజ్యాధికారంకోసం తన పిన్నమ్మ పసుపు కుంకుమలు, తాళిని తెంచాడో ప్రజలందరికీ తెలుసు. అదే రాజ్యాధికారం కోసం ఎంతమంది అక్కచెల్లెమ్మలకు ముద్దులు పెట్టాడో... ఎందరు తల్లుల తలలు నిమిరాడో ఈ రాష్ట్రం ఇంకా మర్చిపోలేదు. ఆ రాజ్యాధికారం కోసమే ఈ ముఖ్యమంత్రి ఎందరు అభాగ్యులను అమలుకు సాధ్యంకానీ హామీలతో మోసగించాడో కూడా అందరికీ తెలుసు. తనకు కావాల్సిన రాజ్యాధికారం కోసం ఎవరిని ఎలావాడాలో... ప్రజలను ఎలామోసగించాలో జగన్ కు బాగా తెలుసు'' అన్నారు అనిత. 

''ముఖ్యమంత్రి జగన్ నిన్న పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో మాట్లాడిన మాటలు వింటే సిగ్గనిపిస్తోంది. టీడీపీ నేత pattabhiram అన్నమాటకు అర్థం వెతుక్కున్నజగన్ తన తల్లిని ఎవరూ ఏమీ అనకపోయినా ఏదో అన్నారంటూ తన పరువుని తానే తీసుకున్నాడు'' అన్నారు. 

''ముఖ్యమంత్రికి, ఆయన కుక్కలకు, భజన బృందానికి ఈ సందర్భంగా ఒక్కటే చెబుతున్నాం. ముఖ్యమంత్రిని గానీ, ఇతర నేతల తల్లులు, వారి కుటుంబ సభ్యులను టీడీపీ ఏనాడూ ఏమీ అన్నదిలేదు. పట్టాభి అన్నమాటకు అర్థం వెతుక్కొని... దానికి విపరీతార్థాలు తీసి, మీకు మీరే ఏదేదో ఊహించుకొని టీడీపీవారిపై అక్రమకేసులు పెట్టిస్తున్నారు. అకారణంగా ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. దీన్నిబట్టే తన రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఈ ముఖ్యమంత్రి సాక్షాత్తూ పోలీస్ సంస్మరణ సభలో తన తల్లిని గురించి తానే అనకూడని మాటలు అన్నారు'' అని తెలిపారు.

PHOTOS  వైసిపి ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు... చంద్రబాబు దీక్షకు దివ్యాంగులు సంఘీభావం (ఫోటోలు)

''డీజీపీని డీజీపీ అనే పరిస్థితి లేదు. డీజీపీ అనేపదాన్ని goutham sawang డీజేపీగా మార్చారు. డీజేపీ అంటే డైరెక్ట్ జగన్ పాలేరు. బాధ్యత గల పదవిలో ఉన్న DGP కి ముఖ్యమంత్రి మాట్లాడింది తప్పుగా కనిపించలేదా? ముఖ్యమంత్రి ఎప్పుడు బహిరంగంగా మాట్లాడినా రాష్ట్రంలో సాగుతున్న గంజాయి, ఇతర మాదకద్రవ్యాల గురించి చెప్పరు. ఆయన మాట్లాడిన ప్రతిసారీ అసలు విషయాలు పక్కనపెట్టి, ఇలా ఏవో వగలమారి ఏడుపులు ఏడుస్తూ, ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి తనపబ్బం గడుపుకోవాలని చూస్తాడు. తరువాత తనకేమీ తెలియనట్టే ఎప్పటిలా పబ్జీ ఆడుకుంటాడు'' అని సెటైర్లు వేసారు.

''జగన్ కార్యకర్తలకు బీపీ వచ్చిందా లేక జేపీ(జగన్ ప్లజర్) వచ్చిందా? ఒక్కసారి వైసీపీ కుక్కలు జనంలోకి వస్తే ప్రజల ఆగ్రహం ఎలా ఉందో తెలుస్తుంది. ఒక మంత్రిగారు అంటున్నారు... గాజులు తొడుక్కొని కూర్చోలేదని. ఆయన తల్లి, చెల్లి, భార్య ఇంట్లో గాజులు వేసుకొనే ఉంటారు. ఆ గాజుల చేతులు పనిచేస్తేనే సదరు మంత్రికి కడుపు నిండుతుంది. గాజుల శక్తి ఏంటో మంత్రికి తెలియాలంటే ఆ గాజులు వేసుకొనేవారి జోలికి వెళ్లి చూడమనండి. గాజులు, చీరలు ధరించినవారి కడుపునే ఈ మంత్రులు పుట్టారని మర్చిపోతేఎలా?'' అని మండిపడ్డారు.

''పోలీసులు లేకుండా, పరదాలు లేకుండా బయటకురాలేని వారు కూడా దమ్ము, ధైర్యం గురించి మాట్లాడితే ఎలా? మీకు నిజంగా దమ్ము, ధైర్యముంటే అమరావతి ఆడవాళ్ల ముందుకు వెళ్లి మాట్లాడండి. అప్పుడు తేలుతుంది మీకున్న దమ్ము, ధైర్యమెంతో?'' అని సవాల్ చేసారు. 

READ MORE  గంటసేపు కళ్లు మూసుకొంటే మేమేంటే చూపిస్తాం:పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

''అప్పుడప్పుడు ఒకావిడ సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చి మాట్లాడుతుంటుంది. జబర్దస్త్ లో కాల్షీట్లు లేనప్పుడు చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడుతుంది. ఆమెలాగా దిగజారి తాము మాట్లాడలేం కానీ ఇకపై లోకేశ్ గురించి, చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడితే ఆమెకే మంచిది'' అని వైసిపి ఎమ్మెల్యే రోజాను హెచ్చరించారు అనిత. .

''మా నాయకుడు ఏం చెప్పాల్సిన పనిలేదు మాకు. కాస్త సైలెంట్ గా ఉంటేచాలు, మాపని మేం చేసుకొని వచ్చేస్తాం. ఆయన్ని చూసే మేం ఆగుతున్నామని గుర్తుంచుకోండి. మాటకు ముందు ఒక అమ్మను మాటకు తర్వాత ఒక అమ్మను పెట్టి మాట్లాడే సన్నబియ్యం సన్నాసి ఏఅమ్మ కొడుకో ఆయనే చెప్పాలి. అలాంటివ్యక్తులు మాట్లాడే మాటలు పోలీసులకు వినిపించవు... కనపడవు. ఏ ఆడవాళ్లను అయితే కించపరిచేలా వైసీపీవారు మాట్లాడుతున్నారో అవే ఆడవారి చేతులు వారి చెంపలు, ఒళ్లు పగలగొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి'' అని అనిత హెచ్చరించారు. 

 
 
 

click me!