నగరి వైసీపీలో రచ్చకెక్కిన విబేధాలు: మంత్రి రోజా, కేజే కుమార్ వర్గాల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Jul 7, 2022, 11:29 AM IST
Highlights

నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి చెందిన నేతల మధ్య విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. మంత్రి రోజా వర్గీయులు కట్టిన బ్యానర్ ముందు కేజే కుమార్ వర్గీయులు బ్యానర్ కట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

తిరుపతి:Tirupati జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో YCP  వర్గాల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి.మంత్రి Roja వర్గీయులకు KJ Kumar  వర్గీయుల మధ్య Flexiల వివాదం చోటు చేసుకొంది. ఈ విషయమై ఇరు వర్గాలు బుధవారం నాడు రాత్రి గొడవకు దిగాయి. ఈ గొడవ విషయమై ఇరు వర్గాలకు పోలీసులు నచ్చజెప్పాయి.  ఇరు వర్గాలు తమ ఫ్లెక్సీల విషయమై  వాగ్వాదం చోటు చేసుకొన్నంత సేపు ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలకు నచ్చజెప్పడానికి పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు.

ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి బీడీ భాస్కర్, కేజే కుమార్ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి రోజా  అనుచరులు కట్టిన బ్యానర్ కట్టారు.ఈ బ్యానర్ కు ముందు కేజే కుమార్ వర్గీయులు బ్యానర్ కట్టారు. ఈ బ్యానర్ విషయం తెలుసుకున్న రోజా అనుచరుడు బీడీ భాస్కర్, కేజే కుమార్ ల వర్గాలు గొడవకు దిగారు.

నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి రోజాకు కేజే కుమార్ వర్గాలు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.  కేజే కుమార్ వర్గం కూడా నియోజకవర్గంంలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేజే కుమార్ వర్గంపై మంత్రి రోజా గతంలో మీడియా వేదికగా కూడా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

నియోజకవర్గంలో కేజేకుమార్ వర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. ఈ కారణంగానే మంత్రి రోజాతో కేజే కుమార్ వర్గం ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నెలకొందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయంతో ఉన్నారు.

రోజాకు ప్రత్యర్ధిగా ఉన్న కేజేకుమార్  కుటుంబానికి జగన్ సర్కార్ నామినేటేడ్ పదవిని కల్పించింది. కేజే శాంతికి ఈడిగ కార్పోరేషన్ చైర్మెన్ పదవిని కట్టబెట్టింది. కేజే కుమార్ గతంలో నగరి మున్సిపల్ చైర్మెన్ గా పనిచేశారు. నగరి మున్సిపల్ చైర్మెన్ గా కేజే కుమార్, ఆయన సతీమణి శాంతి పనిచేశారు.  అయితే రోజా, కేజేకుమార్ మధ్య చాలా కాలంగా ఆధిపత్యపోరు సాగుతుంది.

also read:నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయంలోకి.. మంత్రి రోజా ఎస్కార్ట్ డ్రైవర్ నిర్వాకం

ఈ సమయంలోనే కేజే శాంతికి  ఈడిగ కార్పోరేషన్ చైర్మెన్ పదవిని కేటాయించడం రోజాకు ఆగ్రహం తెప్పించినట్టుగా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే మంత్రి వర్గ పునర్వవ్యవస్థీకరణలో రోజాకు జగన్ కేబినెట్ లో చోటు కల్పించింది. దీంతో రోజా వర్గం సంతోషంలో ఉంది. అయితే ఈ తరుణంలో రోజా వర్గంపై సై అంటే సై అంటున్నారని రాత్రి జరిగిన ఘటన ద్వారా రుజువైందని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

2021 డిసెంబర్ చివరి వారంలో నియోజకవర్గంలోని  రోజా వైరి వర్గం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని రోజా వ్యతిరేకానికి చెందిన నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం అప్పట్లో కలకలం రేపింది. నియోజకవర్గానికి చెందిన అసమ్మతి నేతలు సమావేశం కావడం చర్చకు దారి తీసింది. మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా వైరి వర్గం అభ్యర్ధులను బరిలోకి దింపారు.ఈ పరిణామాన్ని సీరియస్ గా తీసుకున్న రోజా అసమ్మతి వర్గానికి చెక్ పెట్టింది. తన అభ్యర్ధులను గెలిపించుకుంది.
 

click me!