
కొనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన 2014లో పి గన్నవరం నియోజకర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ దక్కలేదు. ఆ తర్వాత పులపర్తి నారాయణ టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి బీజేపీకి రాజీనామా చేశారు. పులపర్తి నారాయణకు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు.