పునీత్ రాజ్ కుమార్ లాగే... వ్యాయామం చేస్తూ ప్రముఖ తెలుగు వెయిట్ లిఫ్టర్ మృతి (Video)

Arun Kumar P   | Asianet News
Published : Jan 28, 2022, 11:52 AM ISTUpdated : Jan 28, 2022, 11:57 AM IST
పునీత్ రాజ్ కుమార్ లాగే... వ్యాయామం చేస్తూ ప్రముఖ తెలుగు వెయిట్ లిఫ్టర్ మృతి (Video)

సారాంశం

ప్రముఖ తెలుగు వెయిట్ లిఫ్టర్ వీరమాాచినేని రాజా రఘురామ్ శుక్రవారం ఉదయం జిమ్ లో కసరత్తులు చేస్తూ మృతిచెందాడు. 

విజయవాడ: జాతీయస్థాయి వెయిట్ లిప్టింగ్ ఫోటీల్లో సత్తాచాటి తెలుగువాడి సత్తాను దేశానికి తెలియజేసిన ప్రముఖ వెయిట్ లిప్టర్ వీరమాచినేని రాజారఘురామ్(29) (veeramachineni raja raghuram) మృతిచెందారు. శుక్రవారం ఉదయం తన జిమ్ లోనే వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయిన అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడిని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. 

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ (hanuman junction) కు చెందిన రఘురామ్ చిన్నవయసులోనే మంచి వెయిట్ లిఫ్టర్ (weight lifter) గా గుర్తింపు పొందాడు. ఏపీ తరపున అనేక జాతీయస్థాయి ఫోటీల్లో పాల్గొన్న ఆయన పతకాలు సాధించారు. ఇలా ఏపీ పేరునే కాదు పుట్టిపెరిగిన హనుమాన్ జంక్షన్ పేరును దేశవ్యాప్తంగా ఇనుమడింపజేసారు. 

Video

రఘురామ్ హనుమాన్ జంక్షన్ లో రా జిమ్ సెంటర్ నడుపుతున్నాడు. ప్రతిరోజూ ఈ జిమ్ లోనే వ్యాయామం చేస్తుంటాడు. ఇలా ఈరోజు కూడా వ్యాయామం చేస్తుండగా అస్వస్థతకు గురయి ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం వీరమాచినేని రాజారఘురామ్ వయసు కేవలం 29ఏళ్లే. ఇంత చిన్న వయసులో అతడు చనిపోవడం క్రీడా ప్రియులనే కాదు ఏపీ ప్రజలకు బాధిస్తోంది.  

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, శరీరాన్ని ఫిట్ గా వుంచుకునేందుకు వ్యాయామం చేయాలని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎక్కువ కాలం జీవించవచ్చని చెబుతుంటారు. కానీ ఇదే వ్యాయామం ఇటీవల ప్రాణాలను బలితీసుకుంటోంది.  

శరీరం తట్టుకునే స్థాయికి మించి వ్యాయామాలు చేయడం వల్ల అనర్ధాలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇటీవల ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలాగే జిమ్ చేస్తూ అస్వస్థతకు గురయి కన్నుమూసారు. ఇప్పుడు తెలుగు వెయిట్ లిప్టర్ వీరమాచినేని రాజా రఘురామ్ కూడా ఇలాగే వ్యాయామం చేస్తూనే ప్రాణాలు కోల్పోయాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu