Andhra Pradesh: ఏపీలో ఉద్యోగ పదవీ విరమణ వయస్సుపై గందరగోళం !

By Mahesh RajamoniFirst Published Jan 28, 2022, 10:28 AM IST
Highlights

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వ ఉద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సుపై గంద‌రగోళం నెల‌కొన్న‌ది. ఇటీవ‌ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును 60 ఏండ్ల నుంచి 62కు పెంచుతున్న‌ట్టు క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. 11వ పీఆర్‌సీ గురించి ఉద్యోగ సంఘాల‌తో జ‌రిగిన స‌మావేశంలోనూ స్వ‌యంగా సీఎం ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు గురించి ప్ర‌స్తావించారు. అయితే, ఈ నెల‌లో ప‌నిదినాలు మ‌రో మూడు రోజులు ఉండ‌టంతో దీనిపై స్ప‌ష్ట‌మైన ఆదేశాలు రాక‌పోవ‌డంతో జ‌న‌వ‌రిలో ప‌ద‌వీ విర‌మ‌ణ కావాల్సిన ఉన్న ఉద్యోగులు అయోమ‌యంలో ప‌డ్డారు. 
 

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వ ఉద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సుపై గంద‌రగోళం నెల‌కొన్న‌ది. ఇటీవ‌ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డి (Chief minister Y.S. Jagan Mohan Reddy) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును 60 ఏండ్ల నుంచి 62కు పెంచుతున్న‌ట్టు క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. సవరించిన వేతన స్కేళ్లతో కూడిన11వ పీఆర్‌సీ అమ‌లు గురించి ప‌లు ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌తో జ‌రిగిన స‌మావేశంలోనూ స్వ‌యంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు గురించి ప్ర‌స్తావించారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పదవీ విరమణ వయస్సును 60 ఏండ్ల నుంచి 62 సంవ‌త్స‌రాల‌కు పెంచనున్నట్లు సీఎం స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర మంత్రి వ‌ర్గం సైతం దీనికి ఆమోదం తెలిపింది. అయితే, ఈ నెల‌లో ప‌నిదినాలు మ‌రో మూడు రోజులు ఉండ‌టంతో దీనిపై స్ప‌ష్ట‌మైన ఆదేశాలు రాక‌పోవ‌డంతో జ‌న‌వ‌రిలో ప‌ద‌వీ విర‌మ‌ణ కావాల్సిన ఉన్న ఉద్యోగులు అయోమ‌యంలో ప‌డ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పదవీ విరమణ వయస్సును 60 ఏండ్ల నుంచి 62 సంవ‌త్స‌రాల‌కు పెంచనున్నట్లు ప్ర‌భుత్వం చేసిన వాగ్దానాల‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి ఉత్త‌ర్వులు ఇంకా విడుద‌ల కాలేదు.  దీంతో జ‌న‌వ‌రి నెలాఖరుకు మూడు పని దినాలు మిగిలి ఉండడంతో 60 ఏళ్లకే సర్వీసు నుంచి రిటైర్ కావాల్సిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. దీనిపై ఉద్యోగ సంఘాలు ప్ర‌భుత్వం వెంట‌నే దీనిపై స్పందిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని కోరుతున్నాయి. జనవరి 31 నాటికి 60 సంవ‌త్స‌రాల‌ వయస్సులో పదవీ విరమణ చేయాల్సిన ప్రభుత్వ జాయింట్ డైరెక్టర్ ఒకరు మాట్లాడుతూ, "నా సేవలు కొనసాగిస్తారో లేదో తెలియక నేను టెన్షన్‌లో ఉన్నాను. ఏదైనా GO జారీ చేయబడిందా అని నేను నా సీనియర్ సహోద్యోగులను అడిగాను. కానీ ప్ర‌భుత్వం ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంపున‌కు సంబంధించి ఎటువంటి ఉత్త‌ర్వులు ఇంకా జారీ చేయ‌లేద‌ని తెలిపారు" అని అన్నారు. ఈ నెలాఖ‌రున రిటైర్డ్ కాబోతున్న చాలా మంది ఉద్యోగులు ఇదే త‌ర‌హా అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రభుత్వం జీవో జారీ చేయాల‌ని కోరుతున్నారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సచివాలయం (AP Secretariat )తో పాటు రాజధాని అమరావతిలోని వివిధ శాఖల కమిషనరేట్లలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగ నిబంధ‌న‌ల ప్ర‌కారం పదవీ విరమణ చేయడానికి  ఈ నెల‌లో మరో రెండు పని దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. శనివారం ప్ర‌భుత్వ సెలవుగా పేర్కొంది. ఇదిలావుండ‌గా, ప‌ద‌వీ విర‌మ‌ణ గురించి రాష్ట్ర ఉన్న‌తాధికారులు సైతం దీనిపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఎందుకంటే జనవరి 31లోగా ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు పత్రాలు సిద్ధం చేయాల్సి ఉన్నందున పదవీ విరమణ వయస్సుపై స్పష్టత ఇవ్వాలని వివిధ శాఖల అధికారులు, ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ శాఖల అధికారులు సైతం స్పష్టత కోరుతున్నారు. ప్రభుత్వం పదవీ విరమణ వయస్సు పెంచిన తర్వాత జీవో తప్పనిసరి అని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు.

60 ఏళ్లు నిండి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులు ప్రభుత్వ సేవలను కొనసాగించేందుకు వీలుగా పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత చట్టానికి సవరణలు చేసి ఆర్డినెన్స్‌ను తీసుకురావాల్సి ఉందని ఉద్యోగ సంఘాల (employee unions) నేతలు అంటున్నారు. ఇటీవ‌లే తెలంగాణ స‌ర్కారు సైతం ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును పెంచింది. ప్ర‌స్తుతం 61 సంవత్సరాల వయస్సులో తన ఉద్యోగులు పదవీ విరమణ చేసేలా ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. 

click me!