ఏపీలో కొత్త జిల్లాలు: అభ్యంతరాలు,కొనసాగుతున్న నిరసనలు

By narsimha lode  |  First Published Jan 28, 2022, 11:04 AM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై పలు జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు సాగుతున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుతో పాటు ఇతర అంశాలకు సంబంధించి నిరసనలు సాగుతున్నాయి.


అమరావతి: Andhra Pradesh  రాష్ట్రంలో కొత్త Districts ఏర్పాటు విషయమై ప్రభుత్వం జారీ చేసిన Notification తో కొన్ని జిల్లాల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో  రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోవడంపై స్థానికులు ఆందోళనలకు దిగారు. Rajampetaను కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంపై ఆందోళనలు చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు.

Chittoor జిల్లా మదనపల్లెను జిల్లా కేంద్రంగా కాకుండా రాయచోటిలో కలపడంపై స్థానికులు భగ్గుమంటున్నారు.నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆందోళనలు సాగుతున్నాయి.విజయవాడలో పెనమలూరు, Gannavaram అసెంబ్లీ నియోజకవర్గాలను కలపడంపై  ఆ ప్రాంత వాసులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. Visakhapatnam లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని  శృంగవరపుకోటను విజయనగరంలో కలిపారు. అయితే నర్సీపట్టణాన్ని కలపకపోవడంపై కూడా అసంతృప్తి చెలరేగింది.

Latest Videos

విశాఖపట్టణానికి సమీపంలో ఉన్న పెందుర్తి, Gajuwaka నియోజకవర్గాలను దూరంగా ఉన్న ప్రాంతాల్లో కలపడంపై ఆందోళన వ్యక్తమౌతుంది.అద్దంకి నియోజకవర్గాన్ని ఒంగోలులో కాకుండా బాపట్లలో కలపడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొంది. కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 26వ తేదీ వరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను కూడా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ లో కోరింది.

కొత్తగా ఏర్పడే జిల్లాలకు  బాలాజీ, అల్లూరి, సీతారామరాజు, అన్నమయ్య, ఎన్టీఆర్, సత్యసాయిబాబాల పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకొంది. తిరుపతి కేంద్రంగా ఏర్పడనున్న జిల్లాకు శ్రీ బాలాజీ, విజయవాడ జిల్లా కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను, విశాఖపట్నం జిల్లాలోని పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేర్లు పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన నరసరావుపేటను జిల్లాగా ప్రకటిచడం కంటే పల్నాడుకు నడిబొడ్డగా ఉన్న గురజాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నారు. నరసరావుపేటను జిల్లాగా ప్రకటిస్తే.. పల్నాడు వాసులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

అయితే హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. హిందూపురం ప్రజల మనోభవాలను అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు.

కొత్తగా ఏర్పాటు కాబోతున్న జిల్లాలకు కాపు కులస్తులైన కొందరి ప్రముఖుల పేర్లను ప్రతిపాదిస్తున్నట్టు కాపు సంక్షేమసేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి వెంకట హరిరామజోగయ్య ప్రభుత్వానికి లేఖ రాశారు. విజయవాడకు వంగవీటి మోహనరంగా పేరును, గుంటూరు జిల్లాకు స్వాతంత్య్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు పేరును, శ్రీ కృష్ణ దేవరాయులు పేరును అనంతపురం జిల్లాకు పెట్టాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. 

నరసాపురం జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ఎంపిక చేయడంలో ఆ ప్రాంత వైసీపీ నాయకులు విజయం సాధించారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.  మరో వైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడ కొత్త జిల్లాలకు కొందరి పేర్లను ప్రతిపాదిస్తూ సీఎం జగన్ కు లేఖ రాశారు.తూర్పు లేక పశ్చిమగోదావరిలో ఒక జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు.. ఏదో ఒక జిల్లాకి శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని ఆ లేఖలో సీఎం ను ముద్రగడ పద్మనాభం కోరారు.

బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని సంతనూలపాడు అసెంబ్లీని ఒంగోలు జిల్లాలో చేర్చారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోకి మార్చారు. మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని పెనమలూరు, గన్నవరం శాసనసభ స్థానాలు విజయవాడ నగర పరిధిలోకి వచ్చాయి. అయితే ఇవి ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి కాకుండా.. కృష్ణా జిల్లాలోనే ఉంచారు. తాజా మార్పులతో కొన్ని లోక్‌సభ స్థానాలకు 8 అసెంబ్లీ స్థానాలు వస్తుంటే.. మరికొన్ని జిల్లాలు 6 శాసనసభ స్థానాలతోనే ఏర్పాటు కానున్నాయి.
 

click me!