russia ukraine crisis: జఫ్రోర్జియా యూనివర్సిటీలో తెలుగు విద్యార్ధుల అవస్థలు.. కన్నవారి ఎదురుచూపులు

Siva Kodati |  
Published : Feb 25, 2022, 05:52 PM ISTUpdated : Feb 25, 2022, 05:55 PM IST
russia ukraine crisis: జఫ్రోర్జియా యూనివర్సిటీలో తెలుగు విద్యార్ధుల అవస్థలు.. కన్నవారి ఎదురుచూపులు

సారాంశం

ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్ధులు (telugu students) అవస్థలు పడుతున్నారు. జఫ్రోర్జియా యూనివర్సిటీలో పెద్ద సంఖ్యలో తెలుగు విద్యార్ధులు వున్నారు. స్వదేశానికి వచ్చే వీలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధ భూమిలో చిక్కుకుపోయిన తమ వారి రాక కోసం విద్యార్ధుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎదురుచూపులు చూస్తున్నారు.

ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్ధులు (telugu students) అవస్థలు పడుతున్నారు. జఫ్రోర్జియా యూనివర్సిటీలో పెద్ద సంఖ్యలో తెలుగు విద్యార్ధులు వున్నారు. స్వదేశానికి వచ్చే వీలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధ భూమిలో చిక్కుకుపోయిన తమ వారి రాక కోసం విద్యార్ధుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎదురుచూపులు చూస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు సిద్ధం చేసింది కేంద్రం. విద్యార్థుల తరలింపుపై చర్యలు చేపట్టింది. 

కీవ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో వున్న విద్యార్ధులను ప్రస్తుతం హంగేరి, రోమేనియా సరిహద్దులకు తరలిరావాలని కోరింది. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తీసుకురానుంది కేంద్రం. రెండు ప్రత్యేక విమానాల్లో ఇవాళ.. కొంతమంది విద్యార్ధులను తరలించే అవకాశం వుంది. వారి ప్రయాణ ఖర్చులను తామే భరిస్తామని కేంద్రం ప్రకటించింది. సరిహద్దు చేరుకునే విద్యార్థుల వాహనాలపై భారత జాతీయ జెండా పెట్టుకోవాలని సూచించింది కేంద్రం. ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్ధులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇటు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. 

మరోవైపు... Ukraineలో చిక్కుకున్న Telangana విద్యార్ధులను రప్పించేందుకు ప్రత్యేక Flight ఏర్పాటు చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR  కేంద్రాన్ని కోరారు. ప్రత్యేక విమానం కోసం అవసరమైన ఖర్చులను కూడా తాము భరిస్తామని కేటీఆర్ చెప్పారు. అటు ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కోసం ఇండియా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చర్యలు ప్రారంభించారు. రష్యా విదేశాంగ మంత్రితో  గురువారం నాడు జైశంకర్ మాట్లాడారు. ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తో మాట్లాడానని దౌత్యమే  ఉత్తమ మార్గమమని తాను చెప్పానని Jaishankar ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకొన్న భారతీయుల తరలింపునకు హంగేరియన్ విదేశాంగ మంత్రి పీటర్ స్జిజార్టో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు సహాయం అందించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్, రాష్ట్ర సెక్రటేరియట్‌ కార్యాలయంలో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ స‌మాచారాన్ని ఓ ప్ర‌క‌ట‌న ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ వెల్లడించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు,సెక్రెటరేట్‌లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీల వివరాలను సీఎస్‌ సోమేష్ కుమార్ ప్రకటించారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో..

విక్రమ్​సింగ్​మాన్: +91 7042566955

చక్రవర్తి పీఆర్‌వో: +91 9949351270

నితిన్ వోఎస్డీ : +91 9654663661

ఈమెయిల్ ఐడీ : [email protected]

తెలంగాణ సచివాలయం -హైదరాబాద్

చిట్టిబాబు ఏఎస్‌వో: 040-23220603, +91 9440854433

ఈ-మెయిల్ ఐడీ : e-mail [email protected] లను సంప్రదించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సూచించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారికోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. 

నోడల్ అధికారి రవి శంకర్ - 9871999055 
 
రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్‌ గీతేష్ శర్మ - 7531904820 

ఏపీ ఎన్ఆర్‌టీ సీఈఓ దినేష్ కుమార్ - 9848460046
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?