సినిమాను కూడా చంద్రబాబు తన రాజకీయం కోసం వాడుకొంటున్నారని ఏపీ మంత్రి పేర్ని నాని చెప్పారు శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
అమరావతి: భీమ్లా నాయక్ నినిమాను కూడా Chandra babu రాజకీయం కోసం వాడుకొంటున్నారని మంత్రి పేర్ని నాని చెప్పారు
ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని శుక్రవారం నాడు సాయంత్రం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. భీమ్లా నాయక్ సినిమాపై చంద్రబాబు సహా విపక్షాలు చేసిన విమర్శలకు మంత్రి Perni Nani కౌంటరిచ్చారు.
TDP ,BJP, Jana sena బ్లాక్ టికెట్ అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.సినిమా టికెట్ల విషయంలో high Court తీర్పు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు ప్రభుత్వమంటే విపక్షాలకు లెక్కలేదన్నారు. నీతులు చెప్పే ఓ హీరో నీతిమాలిన పనులు చేస్తున్నారని పేర్ని నాని మండి పడ్డారు. బ్లాక్ లో టికెట్లు అమ్మితే ప్రభుత్వం పట్టించుకోవద్దా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఓ సిCinema కోసం తండ్రీ కొడుకులు పిల్లి మొగ్గలు వేస్తున్నారని చంద్రబాబుపై పేర్ని నాని సెటైర్లు వేశారు.. Bheemla Nayak సినిమాను తొక్కడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ చట్టాలు సినిమాలకు వర్తించవా అని మంత్రి అడిగారు. జీవో 37 ప్రకారం సినిమా టికెట్ ఛార్జీలు ఉండాల్సిందేనని మంత్రి పేర్ని నాని తెలిపారు.
సినిమా పెద్దలు వచ్చారు. జీవో ఇస్తామన్నారు. ఇప్పుడు జీవో ఎందుకు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారన్నారు. ఈ నెల 24న సినిమా టికెట్ల జీవో రావాల్సింది కానీ మంత్రి Gautham Reddy మృతితో జీవో జారీకి ఆలస్యమైందని మంత్రి పేర్ని నాని వివరించారు.
భీమ్లా నాయక్ సినిమా తాను ఎప్పుడెప్పుడా చూడాలని లోకేష్ ప్రకటించడాన్ని మంత్రి పేర్ని నాని ప్రస్తావించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలైన సమయంలో ఏనాడైనా కూడా చంద్రబాబు , లోకేష్ లు మాట్లాడారా అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ జెండాను JR NTR మోస్తున్నాడు కదా మంత్రి తెలిపారు Pawan Kalyan సినిమాను తొక్కేస్తున్నారని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపాడా ఇంకా ఏమైనా నడిపాడా అని ఆయన అడిగాడు.
తన సినిమాను ఫ్రీగా చూపిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయాన్ని పేర్ని నాని గుర్తు చేశారు. సినిమా బాగుంటే జనం వేలం వెర్రిగా చూస్తారన్నారు. పుష్ప సినిమాను జనం ఇలానే చూశారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇవాళ ఉదయం భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధరల విషయమై ఏపీ ప్రభుత్వం తీరును TDP చీఫ్ Chandra babu Naiduకూడా తప్పుబట్టారు. Twitter వేదికగా చంద్రబాబు ఈ విషయమై స్పందించారు. జగన్ సర్కార్ సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకొందని ఆయన విమర్శించారు.
చివరికి వినోదాన్ని పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోంది. వ్యక్తులను టార్గెట్గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. Bharti Cement ధరలపై లేని నియంత్రణ ‘భీమ్లానాయక్’ సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్ తన మూర్ఖపు వైఖరి వీడాలనిఆయన కోరారు.