
ప్రతిపక్షనేత, టీడీపీ (tdp) నేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆయన కుటుంబ సభ్యులపై ఏపీ అసెంబ్లీలో (ap assembly) వైసీపీ నేతలు (ysrcp) చేసిన వ్యాఖ్యలకు గాను తెలుగుదేశం పార్టీ (telugu desam party) మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. సీఎం జగన్, (ys jagan) అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలకు ఓణీ ఫంక్షన్ నిర్వహించిన నేతలు నిర్వహించారు. చంద్రబాబు సతీమణికి క్షమాపణ చెప్పేవరకు నిరసనలు చేస్తామని వారు తెలిపారు. పోలీసు కేసులకు భయపడమని...ప్రతిరోజు ఇలాంటి వినూత్న నిరసన లు చేస్తూనే ఉంటామని తెలుగు మహిళ కార్యకర్తలు స్పష్టం చేశారు.
కాగా.. గత శుక్రవారం ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన ఆవేదనను రాష్ట్రప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలోనే భావోద్వేగానికి లోనయిన ఆయన బోరున విలపించారు. తన భార్య భువనేశ్వరి గురించి వైసిపి నాయకులు నిండుసభలో అవమానకరంగా మాట్లాడారంటూ చంద్రబాబు వెక్కి వెక్కి కళ్లనీళ్లు పెట్టుకున్నారు.
ALso Read:నిండు సభలో భార్యపై అనుచిత వ్యాఖ్యలు... బోరున విలపించిన చంద్రబాబును పరామర్శించిన రజనీకాంత్
తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు. నేడు జరిగిన ఘటనపై ఏం చెప్పాలో కూడా అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. తనకు పదవులు అవసరం లేదని అన్నారు. క్షేత్ర స్థాయిలో తెల్చుకున్న తర్వాతే తిరిగి అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు. తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు శపధం చేసారు.
నా భార్య ఆమె వ్యక్తిగత జీవితం కోసం, నా కోసం మాత్రమే పని చేసింది. ముఖ్యమంత్రి భార్యగా ఉన్న సమయంలో ఆమె ఏ రోజు కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ప్రజల కోసం ఇంటికి రాకుండా ఎంతకాలం పనిచేసినా నా భార్య ప్రోత్సహించింది. అలాంటిది ఆమె గురించి అవమానకరంగా మాట్లాడటాన్ని నేను తట్టుకోలేకపోయాను'' అంటూ చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. వైసిపి నాయకుల అనుచిత వ్యాఖ్యలను విని, చంద్రబాబు కంటతడిని పెట్టడంపై టిడిపి శ్రేణులతో పలు రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ కూడా చంద్రబాబును ఓదార్చారు.
"