నెల్లూరు వరదలు : బాలినేనికి నిరసన సెగ.. మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి (వీడియో)

By Siva KodatiFirst Published Nov 23, 2021, 7:39 PM IST
Highlights

వైసీపీ నేత, మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. నెల్లూరు జిల్లాలో వరద బాధిత ప్రభావిత ప్రాంతాల్లో ఆయన, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌ బాబుతో కలిసి సందర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రిని బాధితులు గట్టిగా నిలదీశారు. 

వైసీపీ (ysrcp) నేత, మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి (balineni srinivas Reddy) నిరసన సెగ తగిలింది. నెల్లూరు (nellore district) జిల్లాలో వరద బాధిత ప్రభావిత ప్రాంతాల్లో (flood affected areas ) ఆయన, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (nallapareddy prasanna kumar reddy) , కలెక్టర్ చక్రధర్‌ బాబుతో కలిసి సందర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రిని బాధితులు గట్టిగా నిలదీశారు. వరదలో ఇళ్లు మునిగి కట్టుబట్టలతో వీధిన పడ్డామన్నారు. ఆహారం, తాగునీరు లేక అలమటించినా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. వరదలపై ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన మంత్రి బాలినేని.. బాధితులను అన్ని విధాలా అదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఎక్కడికి వెళ్లినా.. నిరసనలు వెల్లువెత్తడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా పర్యటించకుండానే మంత్రి వెనుదిరిగారు.  ప్రస్తుతం  ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

"

click me!