
తమిళనాడులోని నీలగిరి కనుమల్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కుప్పకూలిన (army helicopter crash) ఘటనలో జనరల్ రావత్ దంపతులు సహా 11 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ కూడా వున్నారు. చిత్తూరు జిల్లా కురబల కోటకు చెందిన సాయితేజ్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించినట్లు భారత సైన్యం ప్రకటించింది.
కురబలకోట మండలం ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ్ ఆర్మీలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. సాయి తేజ్ బిపిన్ రావత్‌కు సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. సాయితేజ్ మృతితో ఎగువరేగడి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్యతో చివరిసారిగా ఉదయం ఫోన్‌లో మాట్లాడారు సాయితేజ. ఆయన ఇద్దరు పిల్లలు . సాయితేజ మరణవార్త తెలుసుకున్న గ్రామస్తులు, సన్నిహితులు వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.
Also Read:Bipin Rawat: గతంలో బయటపడ్డా.. నేడు దుర్మరణం
కాగా.. తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. తమిళనాడు (tamilnadu) రాష్ట్రం కొయంబత్తూర్, కూనూరు మధ్యలో బుధవారం ఈ చాపర్ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్‌తో పాటు, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కలిసి మొత్తం 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే కుప్పకూలినట్లు తెలుస్తోంది.
ప్రమాదం తర్వాత చెల్లాచెదురుగా పడివున్న శరీర భాగాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఇదే ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ (Bipin Rawat ) సతీమణి మధులికా (madhulika rawat) కూడా మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో వున్న జనరల్ బిపిన్ రావత్ పరిస్ధితి అత్యంత విషమంగా వుంది. అయితే ఆయన ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా చేయి దాటి పోయింది.