ఉన్నంతకాలం ఏపీకి జగనే సీఎం..: హోంమంత్రి సుచరిత

By Arun Kumar PFirst Published Dec 8, 2021, 5:21 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై  మంత్రులు సుచరిత, సురేష్, శంకర్ నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. 

అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఆయనే వుంటారని హోంమంత్రి మేకతోటి సుచరిత (mekathoti sucharitha) పేర్కొన్నారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా జగన్ (ys jagan) చేశారని కొనియాడారు. మహిళలకు రాజకీయంగా ఎన్నో అవకాశాలు కల్పిస్తున్న గొప్ప వ్యక్తి జగన్ అని అన్నారు. చంద్రబాబు (nara chandrababu) సొంత నియోజకవకర్గం కుప్పం (kuppam) లో కూడా చక్రం తిప్పిన జగన్ నే ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారని హోమంత్రి సుచరిత వెల్లడించారు. 

ఇటీవల ఎన్నికయిన వైసిపి ఎమ్మెల్సీ (ysrcp mlcs)లు బుధవారం ప్రమాణస్వీకారం చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ఇటీవల స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 11మంది సభ్యులు మండలి చైర్మన్ మోషేన్ రాజు (moshes raju) సమక్షంలో ప్రమాణం చేసారు. ఈ కార్యక్రమంలో పలువులు మంత్రులు, వైసిపి నాయకులు కూడా పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ (shankar narayana)మాట్లాడుతూ... ప్రజల గుండెల్లో సీఎం జగన్  దేవుడిగా కొలివైవున్నాడన్నారు. టీడీపీ (tdp) చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదని...  ఆ పార్టీకి భవిష్యత్ లో పుట్టగతులుండవని హెచ్చరించారు. 

read more  ఏపీకి వ‌ర‌ద‌సాయం అందించండి- అమిత్‌షాను కోరిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

మరో మంత్రి ఆదిమూలపు సురేష్ (adimulapu suresh) మాట్లాడుతూ... మండలిలో బలం ఉందని గతంలో ప్రతిపక్షం ఎలా వ్యవహరించిందో చూశామన్నారు. అలాంటిది మండలిలో కూడా వైసిపి బలం పెరిగిన నేడు శుభదినమన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి తప్పక న్యాయం చేస్తారు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. 

''ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నాం. ప్రజల వద్దకు అభివృద్ధి, సంక్షేమం తీసుకువెళ్లాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వం విషం చిమ్ముతున్నారు. మన మధ్య విభేదాలు ఉన్నా కలిసి కట్టుగా పని చేయాలి. నూతన ఎమ్మెల్సీలకు ఇవే నా శుభాకాంక్షలు'' అని మంత్రి సురేష్ అన్నారు. 

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (ummareddy venkateshwarlu) మాట్లాడుతూ... దేశ విదేశాల్లోనూ ఏపీలో జరుగుతున్న పరిపాలన వికేంద్రీకరణ గురుంచి చెప్పుకుంటున్నారన్నారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్ ధన్యవాదాలు తెలుపారు. 

read more  ఇదే మంచి అవకాశం... వాడుకోవాలా? లేదా? అన్నది మీ ఇష్టం..: ఓటిఎస్ పై సీఎం జగన్

నేటితో మండలిలో వైసీపీ బలం 32 కి చేరిందన్నారు. మండలిలో గతంలో బలమున్న టీడీపీ ఎలా వ్యవహరించిందో చూశాం. మండలి ద్వారా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలకి మరింత చేరువ చేస్తామని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి స్పష్టం చేసారు. 

ఇటీవల స్థానిక సంస్థల కోటాలో 11మంది వైసిపి ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా గెలుపొందారు.  విజయనగరం నుండి ఇందుకూరి రఘురాజు, విశాఖపట్నం నుండి వరుదు కల్యాణి, చెన్నూబోయిన శ్రీనివాసరావు, తూర్పుగోదావరి నుండి అనంత సత్య ఉదయ భాస్కర్( బాబు), కృష్ణాజిల్లా నుండి మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్ ఇవాళ శాసన మండలిలో ప్రమాణస్వీకారం చేసారు. 

గుంటూరు నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాడుగుల  హనుమంతరావు, ప్రకాశం జిల్లా నుండి తుమటి మాధవరావు, చిత్తూరు జిల్లా నుండి భరత్, అనంతపురం జిల్లా నుండి ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి చేత మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణస్వీకారం చేయించారు. 

click me!