
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం రథసారథి నారా లోకేష్ ను నెల్లూరు జిల్లా వేంకటగిరి నియోజకవర్గంలో తెలంగాణ తెలుగు యువత బృందం కలిసింది. నారా భువనేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు చిరు జ్ఞాపికను అందజేశారు. ఇందులో తెలుగు యువత మల్కాజ్‌గిరి పార్లమెంట్ అధ్యక్షుడు సాయి నాగార్జున ఉన్నారు.
నడిరోడ్డు మీద ప్రభుత్వ అధికారి చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే, వీడియో వైరల్
వీరంతా యువగళం పాదయాత్ర కొనసాగుతున్న వేంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నారా లోకేష్ ను కలిశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏకే రమేశ్ చందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి విజయ్ కుమార్, అధికార ప్రతినిథి కిరణ్ కుమార్, మాజీ అధికార ప్రతినిథి వంశీ చౌదరి, టీఎన్ టీయూసీ రాష్ట్ర కార్యక్రమాల కార్యదర్శి, పసల ప్రసాద్, తెలుగు యువత నాయకులు అవినాష్, కార్తిక్, రాజకుమార్, హృజిత్ ఉన్నారు.