ఆయన నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం: గవర్నర్ బిస్వ భూషణ్

By Arun Kumar PFirst Published Sep 4, 2020, 12:13 PM IST
Highlights

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయ సమాజానికి శుభాకాంక్షలు తెలిపుతూ గవర్నర్ పేరిట రాజ్ భవన్  ఒక సందేశాన్ని విడుదల చేసింది.  

విజయవాడ: మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయిలందరికి ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు సమాజం యొక్క వాస్తు శిల్పులని, భారతావని నిర్మాణంలో వారి భూమిక ఎంచదగినదని గవర్నర్ కొనియాడారు. ఉపాధ్యాయిల  సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో పయనించలేదని గవర్నర్ పేర్కొన్నారు. 

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయ సమాజానికి శుభాకాంక్షలు తెలిపుతూ గవర్నర్ పేరిట రాజ్ భవన్  ఒక సందేశాన్ని విడుదల చేసింది.   మొదటి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలకు గౌరవార్థంగా ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 5ను ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని బిశ్వ భూషణ్ ప్రస్తుతించారు. 

డాక్టర్ రాధాకృష్ణన్  ఆదర్శవంతమైన విద్యావేత్త, పండితునిగానే కాక తత్వవేత్తగా, రచయితగా భారత దేశానికి సేవలు అందించారన్నారు. సర్వేపల్లి తన జీవితంలో ఉన్నత నైతిక విలువలకు కట్టుబడిన మహనీయిడని గవర్నర్  హరిచందన్ కొనియాడారు. 

click me!