ఇది బిజెపి సాధించిన విజయమే...ఇక మిగిలింది..: సోము వీర్రాజు

By Arun Kumar PFirst Published Sep 4, 2020, 11:35 AM IST
Highlights

రాష్ట్రంలో గుట్కా అమ్మకాలు కూడా అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ఏపి బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. 

అమరావతి: ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలపై జగన్ సర్కార్ నిషేధం విధించింది. నిర్వాహకులు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇక ఆన్‌ లైన్‌ జూదం ఆడుతూ పట్టుబడితే ఆరునెలల జైలు విధించాలని... ఇందుకు సంబంధించిన అధికారులు రూపొందించిన నిబంధనలను  ఏపీ మంత్రివర్గం ఆమోదించింది. 

ఈ నిర్ణయంపై ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు సోషల్ మీడియా వేదికన స్పందించారు. ''ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ వల్ల సామాన్య ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చే చెడు మార్పుల గురించి, ప్రజల సొమ్ము దోపిడీ అవడం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేను మే 2020 లో తీసుకొచ్చాను'' అని వీర్రాజు గుర్తుచేశారు. 

''అలానే గుట్కాని అప్పటికే ప్రభుత్వం నిషేధించినప్పటికీ కిరాణా షాపుల్లో, కిళ్లీ షాపుల్లో బ్లాక్ మార్కెట్ లో గుట్కా దొరకడం గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించాను'' అని అన్నారు. 

''ఈరోజు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ సాధించిన విజయం. అలానే గుట్కా అమ్మకాలు కూడా అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని జగన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను'' అంటూ ఫేస్ బుక్ వేదికన స్పందించిన వీర్రాజు ఇందుకు సంబంధించి గతంలో సీఎం జగన్ కు రాసిన లేఖను జత చేశారు. 


 

click me!