కడపలో దారుణం: దొంగతనం నెపంతో లారీ డ్రైవర్‌ను చితకబాదారు

By narsimha lodeFirst Published Sep 4, 2020, 10:41 AM IST
Highlights

దొంగతనం చేశాడనే నెపంతో  ఓ లారీ డ్రైవర్ ను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకొంది.కడప జిల్లాలోని లారీ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

కడప: దొంగతనం చేశాడనే నెపంతో  ఓ లారీ డ్రైవర్ ను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకొంది.కడప జిల్లాలోని లారీ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సిమెంట్ బస్తాలను దొంగిలించాడనే ఆరోపణలతో లారీ డ్రైవర్ ను చెట్టుకు కట్టేసి అతని యజమాని కొట్టాడు.

ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.కడప పట్టణంలోని ట్రాన్స్ పోర్టు కంపెనీలో కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌బల్లాపూర్  జిల్లా గుడిబండకు చెందిన గిరీష్ అనే యువకుడు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

10 టన్నుల సిమెంట్ బస్తాలను యజమాని చెప్పిన చోటుకు గిరీష్ తరలించారు. అయితే  తనకు 10 టన్నుల కంటే తక్కువగా సిమెంట్ బస్తాలు అందినట్టుగా  సిమెంట్ బస్తాలను  రిసీవ్ చేసుకొన్న వ్యక్తి ట్రాన్స్ పోర్టు యజమానికి ఫిర్యాదు చేశాడు. 

దీంతో ఈ విషయమై గిరీష్ ను యజమాని ప్రశ్నించాడు. సిమెంట్ బస్తాలను బయట విక్రయించాడనే నెపంతో గిరీష్ ను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు.ఈ దృశ్యాలను ట్రాన్స్ పోర్టు కంపెనీలో పనిచేసే మరో ఉద్యోగి వీడియో తీసి మిగిలిన డ్రైవర్లకు షేర్ చేశాడు. సిమెంట్ దొంగతనం చేస్తే ఇలాగే శిక్ష పడుతోందని హెచ్చరించాడు.

ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో విషయం ఎస్ఐ శివప్రసాద్ దృష్టికి వచ్చింది. వెంటనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

click me!