
అనంతపురం : తనవద్ద చదువుకునే విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన వాడే బుద్ది తక్కువ పని చేసాడు. కూతురు వయసున్న బాలికతో పవిత్రమైన క్లాస్ రూంలో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇలా చదువు చెప్పే విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్ కు తగిన శిక్ష విధించిన న్యాయస్థానం.
వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ స్కూళ్లో సాలవేముల బాబు ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అదే స్కూళ్ళో ఎనిమిదవ తకగతి చదివే బాలికపై అతడు కన్నేసి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక క్లాస్ రూం లో ఒంటరిగా వున్న సమయంలో ఈ కీచకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ దుర్మార్గుడి నుండి తప్పించుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది.
Read More చాక్లెట్లు, డబ్బు ఆశచూపి.. ఏడేళ్లలో 30 మంది చిన్నారులపై అత్యాచారం, హత్య.. నిందితుడికి జీవితఖైదు..
విద్యార్థిని కుటుంబసభ్యులు సాలవేముల బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసారు. అతడిపై 354(D), పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు పంపారు.ఈ ఘటనపై దిశ పోలీసులు విచారణ జరిపి ఆధారాలను అనంతపురం జిల్లా స్పెషల్ కోర్టుకు సమర్పించారు. దీంతో సాలవేముల బాబుకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం.