నువ్వొక వేస్టు ఫెల్లో... నీదొక పరమ వేస్టు పార్టీ

Published : Oct 09, 2017, 05:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
నువ్వొక వేస్టు ఫెల్లో... నీదొక పరమ  వేస్టు  పార్టీ

సారాంశం

ఈ రోజు ఆంధ్ర రాజకీయాల్లో హైలైట్  ‘ వేస్టు పార్టీ’, ‘వేస్టు పెల్లోస్’

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి అసలైన వెస్ట్ ఫెలో , వాళ్ల పార్టీ కాంగ్రెస్ అంతకన్న వేస్టు అని

టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండి పడ్డారు.

ఆయనకు అంతకోసం రావడానికి కారణం, రఘువీరారెడ్డి తెలుగుదేశం, బిజెపిలను కట్టగట్టి ‘వేస్టు పార్టీలన్నాడు.

విజయవాడ: ప్రధాని,చీఫ్ మినిస్టర్ ఇద్దరు వేస్ట్ ఫెల్లోస్.పొలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం  తకట్టుపెట్టింది. పోలవరం పూర్తి చేస్తే నే టీడీపీ,బీజేపీ,2019 వ ఎన్నికలకు అర్హులు.లేక పోతే ఎ1  బీజేపీ పార్టీ, ఎ2 టీడీపీ పార్టీ. బీజేపీ టీడీపీ... వైసీపీ అందరూ దొంగలే.

దాని మీద వర్ల రామయ్య ఇలా స్పందించారు. రామయ్య విసిరిన బాణాలివి:

*125 నియోజకవర్గాలలో నీ పార్టీ కి డిపాజిట్లు రాలేదు నీ పార్టీ  వెస్ట్  అన్నారు. ను్వ్వొక వేస్టు ఫెలో.

*నంద్యాలలో మీ పార్టీ కి వచ్చిన ఓట్లు ఎందో ప్రజలకు తెలుసన్నారు.

*కాకినాడ లో ఒక డివిజన్‌లో కూడా ఓట్లు కూడా తెచ్చకోలేని  పార్టీ వెస్ట్ . నీవు వెస్ట్ ఫెలో.

*టిడిపి వేస్టు అని  అనంతపురంలో అంటే రైతులు తరిమి తరిమి కోడతారు.

*నీ సొంత నియోజకవర్గం డిపాజిట్ లు రా లేదు. నువ్వు వేస్టు.

*పోలవరం అసలు ఎక్కడ ఉందో నీకు తెలియని వెస్ట్ ఫెలో నువ్వు

*వెస్ట్ ఫెలో లసంఘానికి అధ్యక్షుడు రఘవీరా రెడ్డి  పెద్ద వేస్టు

అంతటి తో  రామయ్య ఆగలేదు. వైసీపి జగన్ పై కూడా ఇలా ఫైరయ్యారు. 

*దిక్కు మొక్కు లేని పార్టీ వైసీపి పార్టీ కి కార్యలయంను ప్రారంబిచడానికి కూడ రాలేని స్దితిలో జగన్ ఉన్నారని ఆరోపించారు.

*రాష్ట్రం లో ఎన్ని నియోజకవర్గలు ఉన్నాయొ కూడా తెలియని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

*రాజకీయ పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు.

*సీఎం పదవి అనేది జగన్ కు కలగానే మిగిలిపోతుందని జోస్యం చెప్పారు.

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu