చంద్రబాబు మళ్ళీ విదేశాలకు వెళుతున్నారు

Published : Oct 09, 2017, 04:49 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
చంద్రబాబు మళ్ళీ విదేశాలకు వెళుతున్నారు

సారాంశం

ఈనెల 18 వ తేదీ నుంచి 26 వరకు చంద్రబాబునాయుడు మూడు దేశాలలో పర్యటిస్తారు.

ఈనెల 18 వ తేదీ నుంచి 26 వరకు చంద్రబాబునాయుడు మూడు దేశాలలో పర్యటిస్తారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, రాజధాని పరిపాలన నగరం ఆకృతులను ఖరారు చేయడమే లక్ష్యంగా అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లండ్‌లలో చంద్రబాబు పర్యటించనున్నారు.

ఈనెల 18వ తేదీ నుంచి 20 వరకు అమెరికాలోనూ, 21 నుంచి 23వ తేదీ వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటారు. చివరిగా 24 నుంచి 26వ తేదీ వరకు బ్రిటన్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా బ్రిటన్లో ముఖ్యమంత్రి గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా అందుకుంటారు. పెట్టుబడుల సాధనే లక్ష్యమని, రాజధాని డిజైన్ల పరిశీలన పేరుతో చంద్రబాబు ఇంకెన్ని దేశాలు తిరుగుతారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

AP Municipal Elections Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ హడావుడి.. తుపాను వానల్లో ఓట్ల లెక్కింపు రచ్చ
Cyclone Murasu: తీరం దాటిన మురసు తుపాను.. డేంజర్ జోన్‌లో ఏపీ, తెలంగాణ.. కుండపోత వర్షాలపై హైఅలర్ట్