(వీడియో) యధేచ్చగా కోడ్ ఉల్లంఘన

First Published Aug 5, 2017, 6:35 PM IST
Highlights
  • ఉపఎన్నికలో టిడిపి అన్ని నిబంధనలనూ యధేచ్చగా ఉల్లంఘిస్తోంది. మత, కుల సంఘాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నది.
  • అయినా ఎన్నికల కమీషన్ ఏ విధమైన చర్యలూ తీసుకోవటం లేదు.

గెలుపే లక్ష్యంతో నంద్యాల ఉపఎన్నికలో ఎన్నికల కోడ్ ను టిడిపి యధేచ్చగా ఉల్లంఘిస్తోంది. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం విద్యా సంస్ధలను, కులాన్ని ఎన్నికల్లో ఎవరూ ఏ రకంగానూ ఉపయోగించకూడదు. సుప్రింకోర్టు నిబంధనల ప్రకారం మతానికి సంబంధించిన సమావేశాలు కూడా పెట్టకూడదు. అయితే, ఉపఎన్నికలో టిడిపి అన్ని నిబంధనలనూ యధేచ్చగా ఉల్లంఘిస్తోంది. మత, కుల సంఘాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నది. అయినా ఎన్నికల కమీషన్ ఏ విధమైన చర్యలూ తీసుకోవటం లేదు. ఇక్కడ కనిపిస్తున్న వీడియో అందులో భాగమే. ఓ పాఠశాలను టిడిపి తన ప్రచారానికి ఏ విధంగా ఉపయోగించుకున్నదో మీరే చూడండి. 

ఇదిలా వుండగా నంద్యాలలో ఎన్నికలు జరుగుతున్న విధానంపై ఎన్నికల కమీషన్ దృష్టి సారించింది. మంత్రులు నంద్యాలలో తిష్ట వేయటాన్ని తాము గమనించినట్లు పేర్కొంది. ఏ పార్టీ ఎటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నదో గమనించమని అధికారులను పురమాయించమని చెప్పింది. అధికారపార్టీ నేతలు పెద్ద ఎత్తున తిష్ట వేయటం కూడా ఇసి దృష్టికి వచ్చింది దాంతో ఇసి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అని టిడిపిలో  ఆందోళన మొదలైంది.

 

click me!