కేశినేని నాని వర్సెస్ బుద్దా వెంకన్న: టీడీపీ సీరియస్

By narsimha lode  |  First Published Feb 21, 2021, 4:12 PM IST

:విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య అధిపత్య పోరు విషయమై టీడీపీ నాయకత్వం సీరియస్ అయింది. కార్పోరేషన్ ఎన్నికల సమయంలో ఇద్దరు నేతలు వ్యవహరించిన తీరుపై పార్టీలో తీవ్ర చర్చసాగుతోంది.


విజయవాడ:విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య అధిపత్య పోరు విషయమై టీడీపీ నాయకత్వం సీరియస్ అయింది. కార్పోరేషన్ ఎన్నికల సమయంలో ఇద్దరు నేతలు వ్యవహరించిన తీరుపై పార్టీలో తీవ్ర చర్చసాగుతోంది.

also read:బెజవాడ టీడీపీలో వర్గపోరు: నాగులుమీరాపై సోషల్ మీడియాలో పోస్టులు, కేశినేని సంచలనం

Latest Videos

undefined

విజయవాడ కార్పోరేషన్ మేయర్ పదవికి అవసరమైతే తన కూతురు శ్వేత నామినేషన్ ను వెనక్కి తీసుకొంటానని కేశినేని నాని రెండు రోజుల  క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఓటమి పాలైన ఎమ్మెల్యేలు సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారని కూడ ఆయన విమర్శలు చేశారు. బహిరంగంగానే నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం చర్చకు దారి తీసింది. 

also read:అలా అయితే నా కూతురి నామినేషన్ వెనక్కి తీసుకొంటా: కేశినేని నాని సంచలనం

పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేసుకొన్నా సహించేది లేదని టీడీపీ రాష్ట్ర నాయకత్వం తేల్చి చెప్పింది. ఒకరినొకరు విమర్శించుకోవడం ద్వారా పార్టీకి ఇబ్బందులు రావడంతో పాటు వ్యక్తిగతంగాను నష్టం తప్పదని టీడీపీ నాయకత్వం అభిప్రాయపడింది.

విజయవాడ 39వ డివిజన్ అభ్యర్ధి అంశాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీస్తున్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేశారు.  పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ విషయమై స్పష్టత ఇచ్చేవరకు వేచి చూడాలే తప్ప వ్యక్తిగత విమర్శలకు తావు లేదని అధిష్టానం నాయకత్వం తెలిపింది.
 

click me!