బైక్ సీటు కింద పాము: భయంతో జనం పరుగులు

Published : Feb 21, 2021, 03:43 PM IST
బైక్ సీటు కింద పాము: భయంతో జనం పరుగులు

సారాంశం

నెల్లూరు జిల్లాలో బైక్ సీటు కింద పాము కన్పించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు.నెల్లూరు జిల్లా చేజర్ల మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన వేణుగోపాల్ తన బైక్ కు సీటు కవర్ కుట్టించుకొనేందుకు ఆత్మకూరులోని ఆటోనగర్ వద్దకు వచ్చాడు.  

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బైక్ సీటు కింద పాము కన్పించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు.నెల్లూరు జిల్లా చేజర్ల మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన వేణుగోపాల్ తన బైక్ కు సీటు కవర్ కుట్టించుకొనేందుకు ఆత్మకూరులోని ఆటోనగర్ వద్దకు వచ్చాడు.

మెకానిక్ బైక్ సీటును తీశాడు. బైక్ సీటు కింద పాము కన్పించడంతో వెంటనే అక్కడ ఉన్నవారంతా పరుగులు పెట్టారు.  మెకానిక్‌ మున్వర్‌ ధైర్యం చేసి పామును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. కానీ పాము బయటకు రాలేదు. చివరికి బైక్  బాగాలను విడదీశాడు. దీంతో పాము బయటకు వచ్చింది. బయటకు వచ్చిన పామును స్థానికులు చంపేశారు. 

సుమారు గంటకుపైగా పామును బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించారు. పామును బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలను స్థానికులు ఆసక్తిగా గమనించారు.

గతంలో కూడ బైక్ ల్లో పాములు ఉన్న ఘటనలు చోటు చేసుకొన్నాయి. బైక్ సైలెన్సర్లలో, హెడ్ లైట్ల లోపలి భాగంలో కూడ పాములు ఉన్న ఘటనలు అనేకం తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొన్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Speech Krupa Pranganam Re-Consecration Ceremony in Mangalagiri | Asianet News Telugu
Lokesh Motivate Speech: బ్రాహ్మణి అర్థం చేసుకుంటేనే నేను రోడ్లమీద తిరుగుతున్నా | Asianet News Telugu