టిడిపికి షాకిచ్చిన సీనియర్ లీడర్...పార్టీ సభ్యత్వానికి రాజీనామా

First Published Aug 7, 2018, 11:20 AM IST
Highlights

కృష్ణా జిల్లాలో అధికార తెలుగు దేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టిడిపి సీనియర్ నాయకుడు, గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కృష్ణా జిల్లా టిడిపి లో అలజడి మొదలయ్యింది. 

కృష్ణా జిల్లాలో అధికార తెలుగు దేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టిడిపి సీనియర్ నాయకుడు, గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కృష్ణా జిల్లా టిడిపి లో అలజడి మొదలయ్యింది. 

రమేష్ నాయుడు గతంలో రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పోస్టయిన గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ గా పనిచేశారు. అంతేకాదు 1999, 2004 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అయితే ఆయన  టిడిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పార్టీనే అంటిపెట్టుకుని తన సేవలను అందించారు. ఇలా కృష్ణా జిల్లా టిడిపిలో సీనియర్ నేతగా ఎదిగారు. 

అయితే తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తనను పట్టించుకోవడం లేదని గత కొన్ని రోజులుగా ఆయన ఆవేధన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రతినిధిగా, ప్రజా ప్రతినిధిగా 35ఏళ్ల నుంచి వివిధ స్థాయిల్లో అంకిత భావంతో పనిచేసినట్టు ఆయన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు తమ సేవలను వాడుకుని ఇపుడు అధికారంలోకి రాగానే పట్టించుకోవడం  లేదని ఆయన ఆరోపించారు. ఇటీవలే పార్టీలో చేరిన వారికి కూడా పదువులిస్తూ ఎన్నో ఏళ్ల నుండి పార్టీనే నమ్ముకున్న తమను విస్మరించారని అన్నారు. దీంతో మనస్థాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.  

ఈ మేరకు సోమవారం ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. తదుపరి కార్యాచరణను కార్యకర్తలు, అనుచరులతో చర్చించి ప్రకటిస్తానని రమేష్ నాయుడు తెలిపారు.
  

click me!