షాక్: లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య

First Published Aug 7, 2018, 10:50 AM IST
Highlights

చిత్తూరు జిల్లా పీలేరులో మహిళా డాక్టర్  శిల్ప తన ఇంట్లో  ఆత్మహత్య చేసుకొన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో  సీనియర్ డాక్టర్ల లైంగిక వేధింపులపై  శిల్ప రాష్ట్ర గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారు


చిత్తూరు:చిత్తూరు జిల్లా పీలేరులో మహిళా డాక్టర్  శిల్ప తన ఇంట్లో  ఆత్మహత్య చేసుకొన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో  సీనియర్ డాక్టర్ల లైంగిక వేధింపులపై  శిల్ప రాష్ట్ర గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారు.అయితే ఈ ఫిర్యాదుపై డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే మనోవేదనతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు  అనుమానిస్తున్నారు.

చిత్తూరులోని రుయా ఆసుపత్రిలో పీజీ చేసే మహిళలపై సీనియర్ డాక్టర్లు లైంగిక వేధింపులకు పాల్పడేవారని  శిల్ప గతంలో రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై గవర్నర్‌ అప్పట్లో  విచారణకు ఆదేశాలు జారీ చేశారు.విచారణ జరిగింది. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోలేదని శిల్ప  మనోవేదనకు గురైనట్టుగా 
 ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

డాక్టర్ల లైంగిక వేధింపుల విషయమై  రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో  పీజీ పరీక్షల్లో తనను  ఫెయిల్ చేశారని శిల్ప తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందేదని ప్రచారంలో ఉంది.  అంతేకాదు  లైంగిక వేధింపులకు పాల్పడిన సీనియర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడ ఆమెను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే  మంగళవారం నాడు  పీలేరులోని తన నివాసంలో  శిల్ప  ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  శిల్ప ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ వార్త చదవండి:డ్యూటీకి రావాలంటే భయంగా ఉంది: ఆత్మహత్యకు ముందు డాక్టర్ శిల్ప


 

click me!