రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత మృతి

Published : Nov 10, 2018, 10:56 AM IST
రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత మృతి

సారాంశం

రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర నేత ఒకరు కన్నుమూశారు. 

రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర నేత ఒకరు కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెంలోని భోగోలు గ్రామ మాజీ సర్పంచ్ తాడేపల్లి కాంతారావు(54) మృతి చెందారు.  శుక్రవారం సాయంత్రం కాంతారావు.. ద్విచక్రవాహనంపై లింగపాలెం వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కాంతారావు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలు కాగా.. అతనిని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

కాంతారావు మృతి విషయం తెలుసుకున్న భోగోలు గ్రామస్థులు, బంధువులు, టీడీపీ, వైసీపీ నాయకులు భారీగా ఘటనాస్థలికి చేరుకున్నారు. కాగా.. గత పాతిక సంవత్సరాలుగా కాంతారావు టీడీపీ కి సేవలు అందిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాంతారావు మృతితో భోగోలు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?