పందుల నిర్మూలన కార్యక్రమంలో: పందిని కాల్చబోయి, పిల్లాడిని కాల్చారు

By sivanagaprasad kodatiFirst Published Nov 10, 2018, 10:31 AM IST
Highlights

మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. నెల్లూరు నగరపాలక సిబ్బంది స్థానిక సంతపేట ప్రాంతంలో పందుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు.

మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. నెల్లూరు నగరపాలక సిబ్బంది స్థానిక సంతపేట ప్రాంతంలో పందుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఓ ప్రాంతలో పందులు కనిపించడంతో పెల్లేట్ పేల్చారు.

అయితే దీనికి సంబంధించిన పెల్లేట్ గురి తప్పి ఆడుకుంటున్న ఓ ఆరేళ్ల బాలుడి కుడివైపు కణితకు తగిలింది. బాధతో బాలుడు పెద్దగా కేకలు వేయడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాలుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో అక్కడ అత్యవసర విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ పరశురామ్ అనే వైద్యుడు బాలుడిని పరిశీలించి మెడికో లీగల్ కేసు కింద కేసు నమోదు చేయాల్సిందిగా ఎక్స్‌రేకు తరలించారు. ఈ లోపు అక్కడకు వచ్చిన సూపరింటెండెంట్ రాధాకృష్ణరాజు సదరు వైద్యుడిని మెడికో లీగల్ కేసు కింద ఎవరు పెట్టారంటూ ప్రశ్నించాడు..

దీనికి పరశురామ్ తనకు రూల్స్ తెలుసునని...రూల్స్ ప్రకారం నడుచుకుంటానని చెప్పడంతో ఆగ్రహించిన పోలీసులు అతనిపై అసభ్యపదజాలం వాడటంతో పాటు చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో పరశురామ్ జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు చిన్నారిని పరిశీలించిన వైద్యులు... ఎక్స్‌రే నిర్వహించి నిన్న సాయంత్రం బాలుడికి శస్త్రచికిత్స నిర్వహించి పెల్లేట్‌ను తొలగించారు. 
 

click me!