
వైసీపి అధ్యక్షుడు జగన్ తన మాటల్లోనే కాదు చేసే పనుల్లోను ఉన్మాదే అని ధ్వజమెత్తారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. శిల్పా మోహాన్ రెడ్డి అనుచరులు నంద్యాల్లో ప్రతి వార్డు తిరిగి డబ్బులు పంచుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అందుకు సాక్ష్యాంగా ఒక వీడియోను ఆయన విడుదల చేశారు. ఆ వీడియోలో వైసీపి అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అనుచరులు డబ్బులు పంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహాన్ జగన్ పై విరుచుకుపడ్డారు
శిల్పా అనుచరులు డబ్బు పంచుతూ అడ్డంగా దొరికారని సోమిరెడ్డి తెలిపారు. వైసీపీ అధినేత జగన్ గెలుపు కోసం చివరకు డబ్బుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన పెర్కొన్నారు. డబ్బు పంచుతున్న వైసీపి కార్యకర్తలను అరెస్టు చేసి ఆ పార్టీ తరుపు అభ్యర్థి ఎన్నికను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ తన మాటలతోనే కాకుండా చేతలతో కూడా ఉన్మాదిగా మారారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును జగన్ లాంటి వాళ్ళు ఏం చేయలేరని సోమిరెడ్డి అన్నారు. జగన్ తనకు టీవీ, పత్రిక లేదనడం హాస్యాస్పదమన్నారు. మంత్రి అఖిలప్రియ వస్త్రదారణపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన సూచించారు.