మూడు రోజుల్లో చంద్రబాబు-మోడి భేటీ

First Published Jan 5, 2018, 5:34 PM IST
Highlights
  • రెండు మూడు రోజుల్లో చంద్రబాబునాయుడు-మోడి భేటీ జరుగుతున్నది.

రెండు మూడు రోజుల్లో చంద్రబాబునాయుడు-మోడి భేటీ జరుగుతున్నది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి సుజనా చౌదరి మీడియాతో శుక్రవారం స్వయంగా చెప్పారు.  చంద్రబాబు, నేను కలుస్తున్నాం ఎంపీలకు చెప్పిన ప్రధాని మోడీ.    రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలపై ఈరోజు కేంద్రమంత్రితో పాటు పలువురు ఎంపిలు ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిసారు. అనంతరం సుజనా మీడియాతో మాట్లాడుతూ, 2-3 రోజుల్లో చంద్రబాబునాయుడు, తాను కలుస్తామని నరేంద్రమోడీ వెల్లడించినట్లు చెప్పారు.

‘మేమిద్దరం కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పెండింగ్‌ అంశాలు అన్నింటిని చర్చించి ఏపీకి ఎలా న్యాయం చేయాలో చేస్తామ’ని ప్రధాని హామీ ఇచ్చారని సుజనా చెప్పారు.  ‘ఆంధ్రప్రదేశ్‌కి సహాయం చేయటానికి అన్ని వేళలా నేను కృషి చేస్తాను’ అని మోడీ అన్నట్లుగా కేంద్ర మంత్రి చెప్పారు.  ‘అప్పుడే రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడిచిపోయాయా’ అని కామెంట్‌ చేశారట ప్రధాని. పోలవరం విషయంలో అసలు ఇబ్బందులు ఏమీ లేకుండా చేస్తున్నాము అని కూడా మోడీ చెప్పినట్లు కేంద్రమంత్రి తెలిపారు.  

విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై ఏపీలో కాక పుట్టిన నేపథ్యంలో గత కొంత కాలంగా పార్లమెంటులో తమ డిమాండ్లను గట్టిగా వినిపిస్తున్న టీడీపీ ఎంపీలు ప్రధానమంత్రి మోడీపై వత్తిడి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసారు.

click me!