టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబునాయుడు లేఖకు స్పందించారు. తనకు అండగా ఉంటానని చంద్రబాబునాయుడు లేఖ రాయడంపై వంశీ ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి: తాను అండగా ఉంటానని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించడంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధన్యవాదాలు తెలిపారు.తాను రాసిన లేఖకు చంద్రబాబునాయుడు స్పందించడం తనకు సంతోషంగా ఉందన్నారు.
Also Read: చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు.
సోమవారం నాడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ విషయమై స్పందించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని వల్లభనేని వంశీ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం నాడు వల్లభనేని వంశీ ఆదివారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు.
ఈ లేఖకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు లేఖ రాశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని తీసుకొన్న నిర్ణయం సరైంది కాదని చంద్రబాబునాయుడు వల్లభనేని వంశీకి సూచించార. ఈ మేరకు వంశీకి ఆదివారం నాడు రాత్రి లేఖ రాశారు. పార్టీ మొత్తం వంశీకి అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ లేఖకు వంశీ చంద్రబాబునాయుడుకు మరో లేఖ రాశారు.
Also Read:ఇద్దరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్: జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ వెనుక నాని
తన సమర్ధతను చంద్రబాబునాయుడు గుర్తించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 13 ఏళ్ల పాటు పార్టీ కోసం తాను నిరంతరం పనిచేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. పార్టీ కోసం, కార్యకర్తలను కాపాడుకోవడం కోసం తాను ఐపీఎస్ అధికారితో కూడ పోరాటం చేసిన విషయాన్ని ఆ లేఖలో చంద్రబాబుకు గుర్తు చేశారు.
తాను ఎప్పుడూ కూడ చంద్రబాబునాయుడు అడుగు జాడల్లోనే నడిచినట్టుగా ఆ లేఖలో ప్రస్తావించారు. కృష్ణా జిల్లాలో పార్టీ కోసం తాను నిరంతరం తన శక్తివంచన లేకుండా పనిచేసినట్టుగా ఆయన చెప్పారు.
Also Read: అండగా ఉంటా, అది సరైంది కాదు: వల్లభనేని వంశీకి బాబు ధైర్యం
రైవస్ కాలువ ఆక్రమణలపై తాను పోరాటం చేస్తే తనపై కేసులు పెట్టిన విషయాన్ని ఆయన చెప్పారు. తనపై కేసులు పెట్టిన సమయంలో కనీసం జిల్లా పార్టీ పట్టించుకోలేదని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. తన మాటలు ఇబ్బందిపెడితే తనను క్షమించాలని చంద్రబాబును ఆ లేఖలో కోరారు.
టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం నాడు రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామ చేశారు. ఈ రెండు పదవులతొ పాటు రాజకీయాల నుండి కూడ తప్పుకొంటున్నట్టుగా వల్లభనేని వంశీ ప్రకటించారు.
వల్లభనేని వంశీ రాజకీయాలకు కూడ దూరంగా ఉంటానని ప్రకటించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని వంశీ వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకొన్నారనే టీడీపీ నాయకత్వం భావిస్తొంది.
స్థానికంగా వైసీపీ నేతల కారణంగా తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం రాజీనామా చేసినట్టుగా వల్లభనేని వంశీ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. రాజకీయంగా ప్రత్యర్థుల బెదిరింపులకు వంశీ భయపడే మనస్తత్వం ఉన్నవాడు కాదని ఆయన గురించి తెలిసినవారు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కూడ ఆయన రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.
జగన్ సీఎం అయిన తర్వాత నకిలీ ఇళ్లపట్టాల కేసు నమోదు కావడంతో వంశీ ఈ రాజీనామా చేసినట్టుగా చెబుతున్నారు. స్థానిక వైసీపీ నేతలు రెవిన్యూ అధికారులను ఎలా ఈ రకంగా తనపై కేసు పెట్టించారో ఈ నెల 24వ తేదీన వంశీ ప్రకటించారు.
కానీ, ఈ కేసు కారణంగానే వంశీ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడం పట్ల టీడీపీ నేతలు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబుకు రాసిన లేఖకు ఆయన వంశీకి లేఖ పంపారు. తాను అండగా ఉంటానని ప్రకటించారు.