అండగా ఉంటా, అది సరైంది కాదు: వల్లభనేని వంశీకి బాబు ధైర్యం

Published : Oct 27, 2019, 08:27 PM ISTUpdated : Oct 28, 2019, 01:02 PM IST
అండగా ఉంటా, అది సరైంది కాదు: వల్లభనేని వంశీకి బాబు ధైర్యం

సారాంశం

రాజకీయాలకు దూరంగా ఉండాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆదివారం నాడు రాత్రి స్పందించారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని వంశీ రాసిన లేఖపై చంద్రబాబు జవాబు రాశారు. 

అమరావతి: తనతో పాటు పార్టీ యావత్తూ మీ వెంట అండగా ఉంటుందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హామీ ఇచ్చారు. వల్లభనేని వంశీకి ధైర్యం చెప్పారు. ఈ వేధింపులను ఐక్యంగా ఎదుర్కొందామని చంద్రబాబునాయుడు సూచించారు.

పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా  చేయడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్పందించారు. వల్లభనేని వంశీ రాసిన లేఖ తనకు అందిందని చంద్రబాబునాయుడు చెప్పారు.

వైసీపీతో పాటు అధికారుల వేధింపుల వల్ల రాజీనామా చేయడం సరైంది కాదన్నారు. 

ప్రభుత్వం దురుద్దేశ్యంతో ఈ కేసును పెట్టిందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.  అర్హత గల పేద ప్రజలకు వారి ఇంటి స్థలాన్ని క్రమబద్ధీకరించడం తప్పేమీకాదన్నారు

దీని ప్రకారం మన ప్రభుత్వం పేద, బలహీన, బలహీన వర్గాలకు అనుకూలంగా వ్యవహరించిందని గుర్తుచేశారు. ఈ విషయంలో రాజకీయాలను విడిచిపెడితే.. వైసీపీ ప్రతీకార రాజకీయ చర్యలను ఆపబోదన్నారు. 

రాజకీయాలకు రాజీనామా చేయడం లేదా నిష్క్రమించడం సరైన పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. ప్రజలలో అవగాహన కలిగించడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామిక పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడటం తమ బాధ్యత అని పేర్కొన్నారు. 

ప్రస్తుత ప్రభుత్వం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. ఈ పోరాటంలో తనతో పాటు పార్టీ తరపున మేము మీకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులను ప్రస్తుత ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా వేధిస్తోందన్నారు. 

ఈ వేధింపులను ఐక్యంగా ఎదుర్కొంటామని చంద్రబాబు చెప్పారు.‌రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులను ప్రస్తుత ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా వేధిస్తోందని చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈ వేధింపులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేద్దామని చంద్రబాబునాయుడు పిలుపిచ్చారు. పార్టీ క్యాడర్ కు అండగా నిలబడదామని ఆయన సూచించారు.


టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం నాడు రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు  ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామ చేశారు. ఈ రెండు పదవులతొ పాటు రాజకీయాల నుండి కూడ తప్పుకొంటున్నట్టుగా వల్లభనేని వంశీ ప్రకటించారు.

వల్లభనేని వంశీ రాజకీయాలకు కూడ దూరంగా ఉంటానని ప్రకటించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని వంశీ వ్యూహాత్మకంగానే  ఈ నిర్ణయం తీసుకొన్నారనే  టీడీపీ నాయకత్వం భావిస్తొంది.

స్థానికంగా వైసీపీ నేతల కారణంగా తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం రాజీనామా చేసినట్టుగా  వల్లభనేని వంశీ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. రాజకీయంగా ప్రత్యర్థుల బెదిరింపులకు వంశీ భయపడే మనస్తత్వం ఉన్నవాడు కాదని ఆయన గురించి తెలిసినవారు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కూడ ఆయన రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.

జగన్ సీఎం అయిన తర్వాత నకిలీ ఇళ్లపట్టాల  కేసు నమోదు కావడంతో వంశీ ఈ రాజీనామా చేసినట్టుగా చెబుతున్నారు. స్థానిక వైసీపీ నేతలు రెవిన్యూ అధికారులను ఎలా ఈ రకంగా తనపై కేసు పెట్టించారో ఈ నెల 24వ తేదీన వంశీ ప్రకటించారు.కానీ, ఈ కేసు కారణంగానే వంశీ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడం పట్ల టీడీపీ నేతలు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఆదివారం  నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబుకు వల్లభనేని  వంశీ టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవితో పాటు, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడ రాజీనామా చేశారు. నవంబర్ మాసంలో వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతానని ప్రచారం సాగింది.కానీ, చంద్రబాబునాయుడుకు రాసిన లేఖలో రాజకీయాల నుండి తప్పుకొంటున్నట్టుగా వంశీ ప్రకటించారు.

నియోజకవర్గంలో వైసీపీ నేతలు, అధికాారులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో పరోక్షంగా వల్లభనేని వంశీ పరోక్షంగా వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుపై విమర్శలు చేశారు. 

Also Read: చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు.

రాజకీయాలకు దూరంగా ఉంటానని వల్లభనేని వంశీ ప్రకటించడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు వల్లభనేని వంశీని టీడీపీని వీడీ వైసీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

వంశీ తీసుకొన్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. శుక్రవారం నాడు వల్లభనేనిి వంశీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. జగన్ ను కలిసిన సమయంలో ఏం చర్చించారనే విషయమై ప్రస్తుతం చర్చకు తెరలేపింది. 

వంశీని వైఎస్సార్ కాంగ్రెసులో చేర్చుకుంటే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడుతుందని  ఆందోళన చెందుతున్న యార్లగడ్డ  మంత్రులు కొడాలి నాని, పేర్ని నానీలతో కలిసి వంశీ జగన్ నివాసానికి చేరుకున్నారు. జగన్ తో వంశీ అరగంట పాటు సమావేశమయ్యారు. 

Also Read:ఇద్దరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్: జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ వెనుక నాని

వంశీ జగన్ ను కలవడానికి ముందు బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కూడా కలిశారు. అయితే, సుజనా చౌదరిని ఆయన మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వార్తలు వచ్చాయి. చివరికి వంశీ వైసిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వంశీపై ఇటీవల కేసు నమోదైంది. నకిలీ పట్టాలు ఇచ్చారనే ఆరోపణపై ఆ కేసు నమోదైంది.
 

 


 

PREV
click me!

Recommended Stories

Minister Satya Kumar Yadav Pressmeet: జిల్లాల విభజనపై సత్యకుమార్ యాదవ్ క్లారిటీ| Asianet News Telugu
AP Cabinet Big Decision: ఏపీలో ఇక 29 కాదు 28 జిల్లాలుమంత్రులు కీలక ప్రెస్ మీట్ | Asianet News Telugu