విశాలాంధ్ర మాజీ ఎడిటర్‌ కన్నుమూత

By Prashanth MFirst Published Oct 28, 2019, 9:18 AM IST
Highlights

ప్రముఖ పాత్రికేయులు, సీనియర్‌ జర్నలిస్టు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు.

ప్రముఖ పాత్రికేయులు, సీనియర్‌ జర్నలిస్టు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

రాఘవాచారి 1972 నుంచి విశాలాంధ్ర ఎడిటర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. విశాలాంధ్ర ఎడిటర్‌గా మూడు దశాబ్దాలు నిర్విఘ్నంగా కొనసాగారు.   ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి.  సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా సేవలందించారు.  

నేటి సాయంత్రం విజయవాడ విశాలాంధ్ర కార్యాలయం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది.  రాఘవాచారి గారు పాలకుర్తి మండలం శాతపురం కు చెందినవారు. ఆయన పూర్వీకులు తమిళనాడు నుంచి ఇక్కడకు వచ్చారు.

రాఘవాచారి పార్థివ దేహాన్ని కాసేపట్లో మఖ్దూమ్‌ భవన్‌ కు, ఆ తర్వాత విశాలాంధ్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఆయన మృతికి తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు తమ సంఘం తరఫున ప్రగాఢ సంతాపం ప్రకటించారు. 

click me!