రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని టీడీపీ అభిప్రాయపడింది. మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ సర్కార్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడాన్ని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.
అమరావతి: రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. సోమవారం నాడు ఆయన అమరావతిలోని tdp కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులు చట్టాన్ని ycp ప్రభుత్వం ఉపసంహరించుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రానికి amaravati అన్ని విధాలా సరైన రాజధాని అని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల అబివృద్ది కి టీడీపీ కట్టుబడి ఉందని gorantla butchaiah chowdary చెప్పారు. రాజధాని రైతులను పెయిడ్ అరిస్టులు అంటూ వైసీపీ నేతలు విమర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నారు.
also read:మహా పాదయాత్ర కొనసాగుతుంది: అమరావతి జేఎసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకొన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరమీదికి వచ్చింది. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూల్ ను న్యాయ రాజధానిగా, విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా నిర్ణయం తీసుకొన్నారు. అయితే మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎంలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వైసీపీకి చెందిన నేతలు 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా అమరావతిలో రాజధానికి తాము వ్యతిరేకం కాదని ప్రకటించిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని నిరసిస్తూ అమరావతి రైతులతో పాటు టీడీపీ నేతలు, పలు సంస్థలు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు రోజు వారీ విచారణను ప్రారంభించింది.
ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొంటూ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. మరో వైపు ఏపీ అసెంబ్లీలో కూడా మూడు రాజధానుల ఉప సంహరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. మెరుగైన బిల్లుతో సభలో మరో బిల్లును ప్రవేశ పెడతామని సీఎం జగన్ తేల్చి చెప్పారు.