బ్రేకింగ్: రిమాండ్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా

By team teluguFirst Published Aug 13, 2020, 4:55 PM IST
Highlights

నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో అచ్చెన్నకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా... ఈ రోజు కరోనా పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.  ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో హైకోర్ట్‌కు లేఖ రాయాలని వైద్యులు నిర్ణయించారు. 
 

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగుతుంది.   

నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో అచ్చెన్నకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా... ఈ రోజు కరోనా పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.  ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో హైకోర్ట్‌కు లేఖ రాయాలని వైద్యులు నిర్ణయించారు. 

అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై ప్రతివారం హైకోర్ట్‌కు ఆసుపత్రి వర్గాలు బులెటిన్ ను ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అచ్చెన్నాయుడుకు కరోనా చికిత్స అదే రమేష్‌ ఆస్పత్రి వైద్యులు అందిస్తున్నారు. 
 
టీడీపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబీకులు, అభిమానులు, కార్యకర్తలు, అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. 

ఇకపోతే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,64,142కి చేరుకొన్నాయి.

గత 24 గంటల్లో 82 మంది మరణించారు.   అనంతపురంలో 856, చిత్తూరులో 963, తూర్పుగోదావరిలో 1504, గుంటూరులో 595,కడపలో784, కృష్ణాలో330, కర్నూల్ లో 823, నెల్లూరులో682,ప్రకాశంలో680, శ్రీకాకుళంలో  425, విశాఖపట్టణంలో 931, విజయనగరంలో 569, పశ్చిమగోదావరిలో 853 కేసులునమోదయ్యాయి.

also read:ఒంగోలు రిమ్స్ లో కుక్కలు తిన్న డెడ్‌బాడీ: ద్విసభ్య కమిటీ ఏర్పాటు

గత 24 గంటల్లో కరోనాతో  తూర్పుగోదావరి, గుంటూరులలో పదేసి మంది చొప్పున మరణించారు. అనంతపురంలో 8 మంది, కడపలో ఏడుగురు, చిత్తూరు, కర్నూల్ , నెల్లూరు, విశాఖపట్టణం, ప్రకాశం, శ్రీకాకుళం లలో ఆరుగురు చొప్పున మరణించారు. విజయనగరంలో, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురి చొప్పున, కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 27 లక్షల 5 వేల 459 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. గత 24 గంటల్లో 26,483 మంది శాంపిల్స్ సేకరిస్తే 9,996 మందికి కరోనా సోకిందని ప్రభుత్వం ప్రకటించింది.

click me!