ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,64,142కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,64,142కి చేరుకొన్నాయి.
గత 24 గంటల్లో 82 మంది మరణించారు. అనంతపురంలో 856, చిత్తూరులో 963, తూర్పుగోదావరిలో 1504, గుంటూరులో 595,కడపలో784, కృష్ణాలో330, కర్నూల్ లో 823, నెల్లూరులో682,ప్రకాశంలో680, శ్రీకాకుళంలో 425, విశాఖపట్టణంలో 931, విజయనగరంలో 569, పశ్చిమగోదావరిలో 853 కేసులునమోదయ్యాయి.
undefined
also read:ఒంగోలు రిమ్స్ లో కుక్కలు తిన్న డెడ్‌బాడీ: ద్విసభ్య కమిటీ ఏర్పాటు
గత 24 గంటల్లో కరోనాతో తూర్పుగోదావరి, గుంటూరులలో పదేసి మంది చొప్పున మరణించారు. అనంతపురంలో 8 మంది, కడపలో ఏడుగురు, చిత్తూరు, కర్నూల్ , నెల్లూరు, విశాఖపట్టణం, ప్రకాశం, శ్రీకాకుళం లలో ఆరుగురు చొప్పున మరణించారు. విజయనగరంలో, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురి చొప్పున, కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 27 లక్షల 5 వేల 459 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. గత 24 గంటల్లో 26,483 మంది శాంపిల్స్ సేకరిస్తే 9,996 మందికి కరోనా సోకిందని ప్రభుత్వం ప్రకటించింది.
also read:24 గంటల్లో 93 మంది మృతి: ఏపీలో రెండున్నర లక్షలు దాటిన కరోనా కేసులు
బుధవారం నాడు ఒక్కరోజే 9,499 మంది కరోనా నుండి కోలుకొన్నారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో1,68,029 మంది కోలుకొన్నారు.
ఏపీలో జిల్లాల వారీగా నమోదైన మొత్తం కేసులు, మరణాలు
అనంతపురం -27,334, మరణాలు 203
చిత్తూరు - 20,532, మరణాలు 205
తూర్పు గోదావరి -37,146, మరణాలు 248
గుంటూరు -24,413, మరణాలు 265
కడప -15,603, మరణాలు 98
కృష్ణా -11,445,మరణాలు 218
కర్నూల్ -31,056, మరణాలు 264
నెల్లూరు -15,500, మరణాలు 121
ప్రకాశం -10,463, మరణాలు 146
శ్రీకాకుళం -12,773, మరణాలు 150
విశాఖపట్టణం -22,517, మరణాలు 187
విజయనగరం -11,136 మరణాలు 103
పశ్చిమ గోదావరి -21,529, మరణాలు 170
: 13/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2,61,247 పాజిటివ్ కేసు లకు గాను
*1,68,029 మంది డిశ్చార్జ్ కాగా
*2,378 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 90,840 pic.twitter.com/O1IAifmV2R