
‘చంద్రబాబు ప్రభుత్వానికి ఏమైంది’. ‘మంత్రులు, ఎంఎల్ఏలు ఎవ్వరూ నోరు మెదపరేం’ ‘ఒకవైపు జగన్ వాయించేస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం తరపున ఎవ్వరూ పెద్దగా నోరు మెదపటం లేదు’.... ఏదో ప్రకటనలో విన్నట్లుంది కదూ? నిజమే..అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న వారికి ఈ సందేహమే వస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. విభాగాల వారిగా, బడ్జెట్లోని కేటాయింపుల వారీగా లెక్కలు చెప్పి మరీ ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్, రుణమాఫీ, సంక్షేమపధకాల అమలు అంశం ఏదైనా కానీండి..జగన్ దేన్నీ వదలటం లేదు.
మామూలుగా అయితే, జగన్ ప్రసంగం మొదలు కాగానే టిడిపి నుండి జగన్ పై విరుచుకుపడేందుకు పోటీలు పడేవారు. ఏదో రకంగా జగన్ ప్రసంగాన్ని పక్కదారి పట్టించేవారు. దాంతో జగన్ కూడా వారి ట్రాప్ లో పడి ఏదేదో మాట్లాడేవారు. దాంతో సభలో గందరగోళం మొదలయ్యేది. చంద్రబాబు కూడా బాగా ఎంజాయ్ చేసేవారు.
కానీ ఇపుడు జగన్ రూట్ మార్చారు. పద్దతి ప్రకారం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎవరైనా రెచ్చగొట్టాలని చూసినా పట్టించుకోవటం లేదు. దానికితోడు జగన్ విషయంలో ఎప్పుడూ దూకుడు ప్రదర్శించే అచ్చెన్నాయడు, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, రావెల కిషోర్ బాబులు ఇపుడు స్పందించటం లేదు. ఒక్క దేవినేని ఉమ మాత్రమే మాట్లాడుతున్నారు. ఎంఎల్ఏల్లో కాల్వ శ్రీనివాసులు, దూళిపాళ నరేంద్ర, బుచ్చయ్య చౌదరి ఏదో కొద్దిగా మాట్లాడుతున్నారు.
అసెంబ్లీలో ఒక్కసారిగా సీన్ ఎందుకు మారిపోయిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. కారణాలు స్పష్టంగా తెలీదు గానీ జగన్ దూకూడును అడ్డుకునేందకు ప్రభుత్వం వైపునుండి పెద్దగా ఆశక్తి కనబడటం లేదు. జగన్ ఏ అంశం మీద మాట్లాడితే ఆ మంత్రే చూసుకుంటారులే అన్నట్లుంది మిగితావారి వ్యవహారం. దాంతో అసెంబ్లీ ప్రసారాలు చూసే వారికి, కవర్ చేసే మీడియాకు కూడా టిడిపిలో అంతర్గతంగా ఏదో జరుగుతోందనే అనుమానం మొదలైంది.