
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. కావాలనే చేస్తోందో లేక యాధృచ్చికమో తెలీటం లేదు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం గుంటూరులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి కాన్వాయ్ తో జగన్ బయలుదేరిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఏసి లేదు. దానితో పాటు వాహనం లోపల కూడా శుభ్రంగా లేదు. అదే విషయాన్ని వైసీపీ నేతలు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళారు.
జగన్ తిరుగుప్రయాణం సమయంలో గుంటూరులో పోలీసులు వేరే వాహనాన్ని సమకూర్చారు. అయితే, విజయవాడకు వస్తుండగా మంగళగిరి వద్ద ఆ వాహనం పంక్షర్ అయ్యింది. కాన్వాయ్ లోని స్పేర్ వాహనంలో వెళదామనుకుంటే స్పేర్ వాహనం కూడా లేదు. కాన్వాయ్ లో స్పేర్ వాహనం లేదని తెలుసుకుని జగన్ ఆశ్చర్యపోయారు. కొద్ది సేపు అక్కడే వెయిట్ చేసిన తర్వాత లాభం లేదనుకుని ప్రైవేటు వాహనంలో విజయవాడకు చేరుకున్నారు. గతంలో కూడా కర్నూలు నుండి హైదరాబాద్ కు చేరుకునే సమయంలో రన్నింగ్ వాహనం పంక్షర్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా స్పేర్ వాహనం లేదు.
మామూలుగా ప్రోటోకాల్ ప్రకారమైతే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తర్వాత అత్యంత భద్రత ఉండాల్సింది ప్రధాన ప్రతిపక్ష నేతకే. చంద్రబాబుకేమో ఎక్కడబడితే అక్కడ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పెద్ద కాన్వాయ్లను రెడీగా ఉంచుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో చంద్రబాబు కోసం బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ వాహనాలు సిద్ధంగా ఉంచుతున్నపుడు అంత కాకపోయినా జగన్ కు కూడా ప్రోటోకాల్ పాటించాల్సిన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండటం ఆశ్చర్యంగా ఉంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి
https://goo.gl/dDD13Xhttps://goo.gl/dDD13X