ఎన్440కే రగడ: నరసరావుపేటలో మంత్రి అప్పలరాజుపై టీడీపీ ఫిర్యాదు

By Siva Kodati  |  First Published May 12, 2021, 2:56 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్440కే వైరస్‌కి సంబంధించి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పక్షాలు పోటాపోటీగా కేసులు పెట్టుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట టూ టౌన్, వన్ టౌన్, రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో మంత్రి అప్పలరాజుపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

వన్ టౌన్ లో సీనియర్ న్యాయవాది గుండాల సురేష్, టూ టౌన్‌లో నరసరావుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరి శేఖర్ నరసరావుపేట రూరల్ స్టేషన్‌లో సీతారామయ్య ఫిర్యాదు చేశారు. ఏపీలో N440K కరోనా మ్యూటెంట్ పదిహేను రెట్లు ఎక్కువ వేగంగా వ్యాపిస్తుందంటూ మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Latest Videos

Also Read:ఎన్440కె వ్యాఖ్యలతో చిక్కులు: చంద్రబాబుపై గుంటూరు జిల్లాలోనూ కేసులు

అంతకుముందు కర్నూలులోనూ మంత్రి అప్పలరాజుపై కేసు నమోదైంది. కర్నూలులో ఎన్‌440కె రకం కరోనా వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయిందని మంత్రి తొలుత చెప్పారని, అది చాలా ప్రమాదకరమైనదని ఓ చర్చా కార్యక్రమంలో కూడా అన్నారని టిడిపి నేతలు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి అప్పలరాజుపైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

మంత్రి అప్పలరాజుపై కర్నూలు ఒకటవ, 3వ పట్టణ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని ఇతర పోలీస్‌ స్టేషన్లలోనూ, జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేయాలని టిడిపి శ్రేణులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కొత్త రకం కరోనా వ్యాపిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయనపై ఇప్పటికే కర్నూలులో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

click me!